ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో... నెల్లూరు జిల్లా సంగం మండలం తహసీల్దార్‌గా పనిచేసిన గంట సుశీల, ఆమె పిల్లలు సందీప్, ప్రియాంకల పేరిట ఉన్న ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నెల్లూరు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆరు ఫ్లాట్లు, నెల్లూరు, బెంగళూరులలో ఉన్న అపార్ట్మెంట్లు, నెల్లూరులో రెండు, బెంగళూరులో ఒక ఇండిపెండెంట్ ఇళ్లు, ఒక కారు జప్తు చేసిన ఆస్తుల్లో ఉన్నాయి.
అదాయానికి మించిన ఆస్తుల కేసులో నెల్లూరు ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... సుశీలపై న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలైంది. ప్రస్తుతం పదవీ విరమణ పొందిన సుశీల... పలు ప్రభుత్వ పదవులను నిర్వరిస్తున్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి... ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్నది అభియోగం. 12 స్థిర, చరాస్తులు ఇందులో ఉన్నట్టు గుర్తించారు. పీఎంఎల్ చట్టం 2002 ప్రకారం ఈ ఆస్తులన్నింటిని... తాత్కాలికంగా జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది.
ఇదీ చదవండి
నిశ్చితార్థం జరుగుతుండగానే... జనసైనికుడి అరెస్టు..!