ఇప్పటి వరకూ గూడులేని పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సొంత ఇంటి యోగం కల్పిస్తోంది . అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున గృహప్రవేశాలు జరిపేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. సింహపురి లో జరిగే ఈ సందోహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు.
సొంతిల్లు.. ప్రతి పేదవాడి కల.. ! దానిని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేసింది. ఇప్పటికే దపాలుగా రాష్ట్రంలోని పేదలకు గృహయోగం కల్పించిన తెదేపా ప్రభుత్వం.. శనివారం ఒక్కరోజే.. నాలుగులక్షల ఇళ్లను పేదలకు అందివ్వబోతోంది. అన్ని చోట్లా గృహప్రవేశాలను ప్రభుత్వమే ఓ పండుగలా జరిపించబోతోంది. నెల్లూరులో జరిగే గృహప్రవేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా భాగస్వామ్యం వహిస్తున్నారు.
దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించని రీతిలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ నివాసాలను నిర్మించి.. ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర సృష్టించింది. విభజన తరువాత రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉన్నప్పటికీ.. పేదలకు సొంత ఇంటి కలను నిజం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఈ రెండేళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు 80 వేల కోట్లతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని వారి కోసం 30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటికే ఉన్న పథకాలతో కలిపి 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా 20 లక్షల 18 వేల 390 గృహాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సుమారు 34 వేల 632 కోట్లు వ్యయం అవుతుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. పట్టణ ప్రాంతాల్లోనూ 11 లక్షల 21 వేల 619 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.
ఇళ్ల నిర్మాణం అంటే.. ఇంతకు ముందు ప్రభుత్వాలు నిర్మించిననట్లుగా ఆషామాషీగా కట్టడం కాదు. . పల్లెల్లో లబ్దిదారులు సొంతంగా నిర్మించుకుంటుండగా.. పట్టణాల్లో మాత్రం ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి అధనాతనంగా భవనాలు నిర్మిస్తోంది. దాదాపు ప్రతి మునిసిపాలిటీలోనూ.. పెద్ద పెద్ద కాలనీలు వెలిశాయి. నెల్లూరు లాంటి చోట్ల నగరాల్లో ఒకేచోట 7వేల ఇళ్లు నిర్మించారు. చిన్న చిన్న మునిసిపాలిటీల్లోనూ కనీసం 2వేల చొప్పున ఇళ్లు కట్టించారు. ప్రతి చోట అత్యద్భతంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కట్టడాలు గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్నాయి.
2019 ఫిబ్రవరి నాటికి 8 లక్షల 70 వేల 175 గృహాలను అధికార యంత్రాంగం ఇప్పటి వరకు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించింది. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తోంది. కేవలం ఇళ్ల నిర్మాణాలతోనే సరిపెట్టకుండా గత ప్రభుత్వాలకు భిన్నంగా నిర్మాణాలు జరుగుతున్న అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ కాలువలు వంటి సదుపాయాలూ కల్పించింది. పేదల ఇళ్ల స్థలాల భూ సేకరణకూ 500 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం .. ఈ సారి బడ్జెట్ లోనూ.. స్థలాల కోసమే మరో మరో 500 కోట్లు మంజూరు చేసింది.ఇళ్ల నిర్మాణ పనులను నాలుగు దశల్లో జియో ట్యాగింగ్ చేయడం ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఆన్ లైన్ ద్వారా రాయితీ చెల్లింపులు జరుపుతున్నారు.
పేదింటికి పండగొచ్చింది! - nellore
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరో పండగ తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే.. 4 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహిస్తోంది.

Varanasi (Uttar Pradesh), Feb 09 (ANI): Uttar Pradesh Chief Minister inspected Kashi Vishwanath Corridor today. Uttar Pradesh Chief Minister also offered prayers at the temple. The temple is one of the most prominent temples dedicated to lord Shiva. CM Yogi also inspected City Command Control Centre.