నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రవంతి అనే మహిళ 11వేల 111 శివలింగాలు చేశారు. 45 రోజుల్లో ఈ లింగాలు తయారు చేసినట్లు చెబుతున్నారు శ్రవంతి.
పుట్టమన్నుతో కొన్ని, అష్టగంధంతో మరికొన్ని శివలింగాలు తయారు చేశారు. రోజుకు 10 నుంచి 12 గంటలు శ్రమించి శివలింగాలు తయారు చేశారు. ఆమె ఇంటిలోని ప్రతి గదిలో లింగాలు కనిపిస్తాయి. 11వేల నూటపదకొండు లింగాలు ఒకే ఆకారంలో ఎంతో నైపుణ్యంగా సిద్ధం చేశారు.
గత ఐదేళ్లుగా ఎలాంటి స్వార్థం లేకుండా శివునిపై భక్తితో ఇలా వినూత్నంగా తయారు చేశారు. నెల రోజులపాటు లింగాలకు పూజ చేసి... కార్తిక మాసం ఆఖరి రోజున సముద్రంలో నిమజ్జనం చేస్తారు.
ఇదీ చూడండి