ETV Bharat / state

Fevers: మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు - విజృంభిస్తున్న విష జ్వరాలు

వర్షాల కారణంగా సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు మండలాల్లో జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు విష జ్వరాల బారిన పడుతున్నారు.

మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు
మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు
author img

By

Published : Jul 2, 2022, 4:12 PM IST

పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు జ్వరాల వ్యాప్తి ఎక్కువైంది. జిల్లా కేంద్రంలోని పెద్ద ఆసుపత్రిలో రోజుకి ఆరు నుంచి ఏడుగురు చిన్నారులు జ్వరాల కారణంగా ఆసుపత్రిలో చేరుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. గడచిన వారం రోజుల్లో 80 నుంచి 100 మంది వరకు జ్వరాల బారిన పడి ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు వెల్లడించారు.

జిల్లా ఆసుపత్రికి రోగులు తాకిడి ఎక్కువగా ఉండటంతో మంచానికి ఇద్దరు రోగులను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. జ్వరాల కేసులు అధికంగా నమోదయ్యే గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. పరిసరాలు, తాగునీటి విషయంలోనూ అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.