ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయాలని.. రోడ్డెక్కిన రైతులు - Farmers protest today

Farmers Protest: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం పెద్దదిమిలిలోని ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. అంతర్రాష్ట్ర రహదారిని 3 గంటలపాటు దిగ్బంధించారు.

Farmers Protest
రైతుల నిరసన
author img

By

Published : Feb 21, 2023, 1:52 PM IST

ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసన తెలిపిన రైతులు

Farmers Protest: అసలే సరైన మద్దతు ధర లేదని విలపిస్తున్న రైతులను.. అధికారులు మరింత ముప్పుతిప్పులు పెడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని.. అధికారులు కొనుగోలు చేయడం లేదు. అంతటితో ఆగకుండా.. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని, ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. రహదారిని దిగ్బంధించి.. తమ నిరసనని తెలిపారు.

తమ ధాన్యం కొనుగోలు చేయాలంటూ పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం పెద్దదిమిలి రైతులు రోడ్డు ఎక్కారు. జనవరి నుంచి ధాన్యం సిద్ధంగా ఉంచినా.. అధికారులు కొనుగోలు చేయట్లేదు అంటూ నిరసన తెలిపారు. ఏబీ రహదారికి అడ్డంగా నాటు బళ్లు, ట్రాక్టర్లు పెట్టి రహదారిని దిగ్బంధించారు.

ఖరీఫ్‌ సీజన్‌లో అనుకున్న స్థాయిలో ధాన్యం రైతులకు పండినప్పటికీ.. అధికారులు సకాలంలో కొనుగోలు చేయక పోవడం వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మండిపడ్డారు. తమ వద్దకు అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ.. రాకపోవడంపై రైతులు మండిపడ్డారు. అంతర్రాష్ట్ర రహదారిని మూడు గంటల పాటు నిర్బంధించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు పోలీసులు నచ్చచెప్పి.. రైతులను ఆందోళన నుంచి విరమింపజేశారు.

ఇప్పటికి అయినా తమ ధాన్యం.. కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం, అధికారులు తమను ఆదుకోవాలని.. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు.

"ధాన్యం వెళ్లడం లేదు.. మద్దతు ధర లేదు. రైతుల ఇళ్లకు.. డబ్బుల కోసం కూలీలు వస్తున్నారు. ఇక్కడ మా దగ్గర ఇవ్వడానికి రూపాయి కూడా లేదు. సంక్రాంతికి బట్టలు కూడా తీసుకోలేదు. రైతుల బాధలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా ఎవ్వరూ రావడం లేదు.. వచ్చినా సమాధానం చెప్పడం లేదు. గత నాలుగు నెలలుగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు". - రైతు

"గత కొన్ని రోజులుగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఫోన్ చేస్తే.. నా వల్ల కాదు.. మీకు ఏం వీలైతే అది చేసుకోండి అని అధికారులు మాట్లాడుతున్నారు. అందుకే మేము ఈ రోజు రోడ్డు ఎక్కాము". - రైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.