DIED: విద్యుత్షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమై రెండేళ్ల బాలుడు సజీవదహనమైన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులో చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లు తెగి కాలనీకి చెందిన అనపర్తి కోటేశ్వరరావు పూరింటిపై పడింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. రెండేళ్లున్న మూడో కుమారుడు కిరణ్ అగ్నికి ఆహుతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి.. బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతిచెందిన బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బాధిత కుటుంబ సభ్యులను నరసరావుపేట తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. అధికారులు బాధిత కుటుంబానికి తక్షణమే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అరవింద బాబు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన సంభవించిందని అధికారుల తీరుపై అరవింద బాబు మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 50 వేల రూపాయల నగదు, సరుకులు అందజేశారు. అదేవిధంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నష్టపోయిన కుటుంబానికి విద్యుత్ శాఖ తరపున నష్టపరిహారం చెల్లించే దిశగా అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చదవండి: