TDP Leader Devineni Umamaheswara Rao : ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని.. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27 వరకు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించగా.. పర్యటన నేపథ్యంలో కార్యాచరణపై సమీక్షించారు.
పల్నాడు, గుంటూరు జిల్లాలలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండలో చంద్రబాబు పర్యటిస్తారని దేవినేని ఉమా వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన, వైసీపీ అరాచక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. వైసీపీ హయంలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. దళితులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. బాబాయ్ హత్య కేసులో సీబీఐ నోటీసులు తాడేపల్లిని తాకబోతున్నాయని అన్నారు. త్వరలోనే వారి పాపలన్నీ బయట పడతాయని అన్నారు. జగన్ పాలన చేతకాక చతికిలా పడ్డారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని వ్యాఖ్యనించారు. ప్రజల్లో పెద్ద ఎత్తున వైసీపీపై వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే.. చంద్రబాబుపై ఎర్రగొండపాలెంలో దాడి చేశారని అన్నారు. ఐప్యాక్ డైరెక్షన్లోనే చంద్రబాబుపై దాడి జరిగిందని ఆరోపించారు. వైసీపీలో ఓ ఎంపీ ప్యాంటు తీసి.. మరో మంత్రి చొక్కా తీసీ రండి చూసుకుందాం అంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ చొక్కాలు తీయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైసీపీ ఎన్ని దాడులకు దిగినా టీడీపీ కార్యకర్తలు భయపడరని స్ఫష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు టీడీపీకి పట్టం కట్టడానికి.. సిద్ధంగా ఉన్నారు అని పేర్కొన్నారు. చంద్రబాబుతో పర్యటనకు ప్రజలు ఎండను కూడా లెక్కచేయకుండా చంద్రబాబు పర్యటనలో పాల్గొనేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం 10లక్షల కోట్లకు పైనే అప్ఫుల ఊబిలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపే వరకు ప్రజల నిద్రపోరన్నారు. ఎన్ఎస్జీ కమాండెంట్ తలకు గాయలయ్యాయని.. వారు లేకపోతే కార్యకర్తలకు, టీడీపీ శ్రేణులకు గాయాలయ్యేవని అన్నారు. సీఎం జగన్ విధ్వంసాన్ని కళ్ల చూడాలని అనుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని తగలబెట్టటానికే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
ఇవీ చదవండి :