Nakka Ananda Babu Comments: మాచర్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబు విమర్శించారు. గురజాలలో ఇవాళ తెలుగుదేశం పార్టీ సమావేశానికి వెళ్లకుండా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. యడ్లపాడు వద్ద జాతీయ రహదారిపై ఆయనను అడ్డుకుని అరెస్టు చేసి, నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై నక్కా ఆనంద బాబు మండిపడ్డారు. తాము స్వేచ్ఛగా తిరిగే హక్కు లేకుండా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నిలువునా దహనం చేస్తున్నారని దుయ్యబట్టారు.
మాచర్లలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ కేవలం టీడీపీ నేతలకు మాత్రమేనా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అక్కడ ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారి టీడీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ ఆరోపించారు.
మాచర్లకు నిజంగానే ఖర్మ పట్టింది. అందుకే ఇదేెం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేస్తున్నాం. మాచర్లకు పట్టిన ఖర్మ.. రాష్ట్రం మొత్తం విస్తరించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు ఉంది. పోలీసులు, వైసీపీ రౌడీ మూకలు కుమ్మక్కయ్యారు. - నక్కా ఆనంద్ బాబు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు
ఇవీ చదవండి: