ETV Bharat / state

చిలకలూరిపేటలో వివాహ వేడుకకు.. హాజరైన బాలకృష్ణ దంపతులు - బాలకృష్ణ వార్తలు

చిలకలూరిపేటలో ఓ వివాహ వేడుకకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. హిందూపురం తెలుగుదేశం సమన్వయకర్తగా పనిచేసిన పావులూరి శ్రీనివాసరావు, కళ్యాణి దంపతుల కుమార్తె వివాహానికి... సతీమణి వసుంధరతో కలిసి వచ్చారు. వధూవరులు స్వాతి, జయంత్ కుమార్‌ను ఆశీర్వదించారు. భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు... జైబాలయ్య అంటూ నినాదాలు చేశారు.

బాలకృష్ణ దంపతులు
బాలకృష్ణ దంపతులు
author img

By

Published : May 22, 2022, 4:28 AM IST

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా నాయకులు, హిందూపురం తెదేపా సమన్వయకర్తగా పనిచేసిన పావులూరి శ్రీనివాస రావు, కళ్యాణి దంపతుల కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. గుంటూరు నుంచి చిలకలూరిపేట వచ్చిన బాలకృష్ణ, వసుంధర దంపతులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.

జాతీయ రహదారి పక్కన పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కళ్యాణ మండపంలో వధూవరులు స్వాతి, జయంత్ కుమార్​లను బాలకృష్ణ దంపతులు ఆశీర్వదించారు. పెద్ద ఎత్తున కళ్యాణ మండపం వేదిక వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. జైబాలయ్య అంటూ నినాదాలు చేశారు. సెల్ఫీలు, ఫొటోలు దిగారు. బాలకృష్ణ, వసుంధర దంపతుల వెంట మాజీ మంత్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు, సతీమణి వెంకట కుమారి ఉన్నారు. వివాహ వేడుకకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాచర్ల తెదేపా ఇన్​ఛార్జి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: రాఘవేంద్రుడి 'ప్రేమలేఖ'లో దర్శకుల సందడి..మీరూ చూసేయండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.