ETV Bharat / state

సాగునీరందక బీళ్లుగా మారుతున్న పొలాలు - రైతుల కంట ఉబుకుతున్న కన్నీళ్లు - నీరందక ఎండుతున్న పంటలు

Crops Drying Due to Lack of Irrigation Water: పదేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతుల్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. సాగునీరు లేక నిలువునా ఎండిపోతున్న పైర్లు బీళ్లను తలపిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టి వందల అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా చుక్కనీరు కూడా పడటం లేదని పల్నాడు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి రూపాయి వచ్చే పరిస్థితి లేదని, చేసిన అప్పులు తీర్చేందుకు పెంచుకున్న పశువుల్ని సైతం అమ్ముకునే దయనీయ పరిస్థితుల్లో ఉన్నామని అన్నదాతలు బావురుమంటున్నారు.

Crops_Drying_Due_to_ Lack_of_Irrigation_Water

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 12:13 PM IST

Crops Drying Due to Lack of Irrigation Water : పల్నాడు జిల్లాలో కరవు మేఘాలు కమ్మేయనడానికి బీటలు వారిన పంట పొలాలే సజీవ సాక్ష్యాలు. జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. బొల్లాపల్లి మండలంలో చుక్కనీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. వర్షాలు పూర్తిగా ముఖం చాటేయడంతో పంటలు బెట్టకొచ్చి ఎండు ముఖం పట్టాయి. సాగునీరు సౌకర్యం లేకపోవడంతో బొల్లాపల్లి మండలాల పలు గ్రామాల రైతులు వ్యవసాయ బోర్లు మీద ఆధారపడి సాగు చేస్తున్నారు. బోర్లలో నీరు అడుగంటడంతో వాటి ఆధారంగా సాగు చేసిన ప్రధాన పంట మిరప పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మరో పక్షం రోజులు ఇలాగే బెట్ట వాతావరణం కొనసాగితే పూర్తిగా ఆశలొదులుకోక తప్పదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Water Crisis in Palnadu District : బొల్లాపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. రేమిడిచర్ల పరిసర గ్రామాల ప్రజలు అధికంగా మిరప పంట సాగు చేస్తున్నారు. ఊరిబిండి ఏడుకొండలు అనే రైతు తనకున్న మూడు ఎకరాలతోపాటు రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం ఐదు ఎకరాలు మిరప పంట సాగు చేశాడు. కౌలుతో కలుపుకుని దాదాపు ఎకరాకు 70 నుంచి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడు. పురుగు మందులు, బలం మందు కూడా వేశాడు. ఇప్పుడు నీరు లేక పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో మధ్యలోనే పంటను వదిలేశాడు. ఇతర రైతుల పరిస్థితి కూడా దాదాపు ఇదే.

Crops Drying Due to Lack of Irrigation నీరులేక ఎండిన పంట.. ఆరుగాలం కష్టించిన రైతు కంట కన్నీరు..

Farmers Suicides in AP : మరి కొంతమంది వర్షాలు పడకపోవడంతో పంటను రక్షించుకునేందుకు బోర్లను నమ్ముకున్నారు. భూగర్భ జలాలు లేక బోర్ల నుంచి చుక్క నీరూ రాకపోవడంతో పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఆశ చావని రైతులు మాత్రం కొత్త బోర్లు వేయించారు. కానీ ఫలితం శూన్యం. అప్పులు రెట్టింపు కావడంతో ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. అధికారులు మాత్రం తమ కష్టాలను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Water Crisis in AP : గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో నీటి ఎద్దడి చూడలేదని రైతులు అంటున్నారు. బొల్లాపల్లిలో మండలంలో ఎక్కువ మంది గిరిజన నిరుపేద రైతులే. వీరంతా తమకున్న ఒకటి రెండు ఎకరాలకు మరో పది ఎకరాలు కౌలు తీసుకుని పంట సాగు చేస్తున్నారు. గతేడాది ఉపాధి పనులకు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లామని, అప్పులు తీర్చేందుకు ఈ ఏడాది సాగు పై ఆధారపడగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు (Rainfall Conditions) ఆశలపై నీళ్లు చల్లాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No Irrigation Water To Chilli Crop: మిర్చి పంటకు పారని సాగునీరు.. రైతన్న కంట పారుతున్న కన్నీరు

Farmers Problems with No Water : ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు సాగు నీటికి ఇక్కట్లు పడుతుంటే పాలకులు, అధికారులు సాగునీరు అందించే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఈ సమస్య జఠిలమైందని ఆరోపిస్తున్నారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఈ ఏడాది పంట చేతికి వచ్చేది లేదంటున్నారు. అప్పులు తీర్చేందుకు గేదెలను, ఆవుల్ని సైతం విక్రయిస్తున్నామని (Farmers Selling Livestock), తమకు మళ్లీ వలసలే దిక్కు అని కంటతడి పెడుతున్నారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో పంటలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని వాపోతున్నారు. వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలే వేసుకునేలా చర్యలు తీసుకుని ఉంటే ఈ సాగు కష్టాలు, నష్టాలు తప్పేవని అంటున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్నందుకు ఏటికేడు అప్పులు పెరిగి ఆర్ధికంగా కోలుకోలేని పరిస్థితికి దిగజారుతున్నామని రైతులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

Farmer Removed Chilli Crop Due to Lack of Water: భయపడిందే జరిగింది..! నీరందక ఎండుతున్న పంటలు.. రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.