పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అర్ధరాత్రి దారి దోపిడీ జరిగింది. తిరుపతి నుంచి వచ్చిన భక్తులపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేసి సొమ్మును ఎత్తుకెెళ్లారు రాజుపాలేనికి చెందిన శ్రీనివాసరావు, గోవిందరావు కుటుంబసభ్యులు.. తిరుపతి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోమవారం తెల్లవారుజామున నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైలులో వచ్చి సత్తెనపల్లిలో దిగారు. స్టేషన్ నుంచి కాలినడకన తాలుకా సెంటర్కు నడిచి వెళ్తుండగా.. కొందరు గుర్తుతెలియని దుండగులు బైకులపై వెంబడించి కర్రలతో దాడి చేశారు. అనంతరం వాళ్ల వద్ద ఉన్న రూ. 5 వేల నగదు, వాచీ, సేల్ఫోన్ ఎత్తుకెళ్లారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల దాడిలో గాయపడ్డ బాధితులు ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: