ETV Bharat / state

పల్నాడు జిల్లా జూపూడిలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు - palnadu news

144 section imposed at jupudi
జూపూడిలో 144 సెక్షన్ విధింపు
author img

By

Published : Apr 15, 2022, 10:01 PM IST

Updated : Apr 17, 2022, 6:50 AM IST

21:53 April 15

అమరావతి మండలం జూపూడిలో సమసిపోని వివాదం

144 section imposed at Jupudi: పల్నాడు జిల్లా అమరావతి మండలం జూపూడిలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. పోలీసుల సమక్షంలో.. ఇరువర్గాల వారు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో.. ఎస్సై ఇద్దరు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. పాత వివాదాల నేపథ్యంలో.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా... గ్రామానికి చెందిన రెండు వర్గాల వారు దాడులకు పాల్పడి, వాహనాలు, ఇళ్లలోని ఫర్నిచర్​ను సైతం ధ్వంసం చేసుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపుచేసి పికెట్​ ఏర్పాటు చేశారు. తాజాగా... ఓవర్గం వారు అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసుల సమక్షంలోనే మరో వర్గం వారు వారిపై దాడులకు పాల్పడ్డారు. దాడులను ఆపేందుకు ప్రయత్నించిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో సహా... 10 మంది గ్రామస్థులకు గాయాలయ్యాయి. గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు.

ఇదీ చదవండి: Undavalli: "జగన్‌ కొత్త తరహా క్విడ్‌ ప్రోకోకి తెరలేపారు"

Last Updated : Apr 17, 2022, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.