AP New Governor : ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్రాంత న్యాయవాది అబ్దుల్ నజీర్‌ను పలువురు రాజకీయ నేతలు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, పలువురు నేతలు జస్టిస్ నజీర్‌ని వ్యక్తిగతంగా కలిశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు.. కొత్త గవర్నర్‌తో దిగిన ఫొటోను తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పంచుకున్నారు.
గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా.. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం కలిశారు. న్యాయ వ్యవస్థలో ఆయనకున్న అపారమైన అనుభవం రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌గా ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తనని చూడడానికే జడుసుకుంటున్నారని.. అందుకే రాష్ట్రంలో తనను అడుగుపెట్టనిచ్చేదే లేదని భీష్మించుకు కూర్చున్నారని వ్యంగ్యస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. ఇది గ్రహించే కేంద్ర పెద్దలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని గవర్నర్‌గా నియమించినట్లు స్పష్టమవుతోందని అన్నారు.
ఏపీ నూతన గవర్నర్‌గా విశ్రాంత న్యాయవాది అబ్దుల్ నజీర్ : పలు రాష్ట్రాలకు కేంద్రం ఇటీవలే నూతన గవర్నర్లను నియమించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. మొత్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా రమేశ్ బైస్ను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఇప్పటివరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు రమేశ్.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివ్ ప్రతాప్‌లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, లద్దాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో నియమించారు ముర్ము.
ఇవీ చదవండి :