ETV Bharat / state

అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచుతున్నాడు - YS Jagan Own Party Candidates news

YS Jagan Caste Candidates Leaving YSRCP: రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు పార్టీని వీడగా.. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డిలు వైసీపీని వీడటం వెనకున్న అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ys_jagan_own_party_candidates_leaving
ys_jagan_own_party_candidates_leaving
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 7:55 PM IST

YS Jagan Own Party Candidates Leaving YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైన తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో, ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలుగా, పార్టీ సమన్వయకర్తలుగా పని చేసిన జగన్ మోహన్ రెడ్డి సొంత సామాజికవర్గం అభ్యర్థులు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి పార్టీని, వైఎస్ జగన్నీ నమ్ముకున్నోళ్లను ఆయన నట్టేట ముంచాడా? ఒక్కరోజులోనే సుమారు 11 నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చటం వెనకున్న కథేంటి? వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోబోతుంది అని జగన్‌కు ఇప్పటి నుంచే భయపట్టుకుందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

YSR Congress Party Updates: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) స్థాపించిన రోజు నుంచి ఇప్పటిదాకా అతని వెంట నడిచిన సొంత సామాజికవర్గం అభ్యర్థులు పార్టీకి రాజీనామాలు చేస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లపాటు పార్టీలో అగ్రతాంబూలం ఇచ్చి, అందలం ఎక్కించిన జగన్, తన సొంత సామాజికవర్గం వారు నిరసన గళాలు విప్పుతుండడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతోంది. తాజాగా పార్టీ పెద్దలు 11 నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చటంపై ఆ పార్టీ అసంతృప్తులు భగ్గుమంటున్నారు.

వైసీపీ ఇంచార్జ్​లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్‌ గట్టిగా పని చేసిందని ప్రచారం

CM Jagan 823 Posts Appointed Own Community Members: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి, అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ సలహాదారులు, ఇతర నామినేటెడ్‌ పదవులు, కార్పొరేషన్‌ ఛైర్మన్‌లు, డైరెక్టర్లు, ఆఖరికి విశ్వవిద్యాలయాల వీసీలుగా సొంత సామాజిక వర్గానికే కట్టబెడుతూ వస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనేకమార్లు ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా ముందుకు సాగారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ ఇప్పటివరకూ దాదాపు 823 పదవులను ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టారంటే వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇట్టే అర్ధమైపోతుంది.

Key MLAs left YSRCP: అయితే, ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కీలక నేతలు వైసీపీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. మొదటగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక నుంచి వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డిలు పార్టీని వీడారు.

MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌‌రెడ్డి తొలుత వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయనకు (కోటంరెడ్డికి) మంత్రి పదవి ఇవ్వకపోవడంతోపాటు తన కంటే వెనక పార్టీలోకి వచ్చిన కాకాణికి మంత్రి పదవి ఇవ్వడంతో కోటంరెడ్డి అవమానంగా భావించారు. వైఎస్‌ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే కోటంరెడ్డి, జగన్‌ కష్టనష్టాల్లోనూ వెన్నుదన్నుగా నిలిచారు. అలాంటి కోటంరెడ్డిని పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యం కల్పించకపోవడంలోనూ, నియోజకవర్గం అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేశారు. దాంతో తీవ్ర అవమానంగా భావించిన కోటంరెడ్డి వైసీపీ పార్టీని వీడారు.

ప్రభుత్వం స్పందించేదాకా.. అసెంబ్లీలో పోరాటం చేస్తా: ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Anam Rannarayana Reddy: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి సమకాలీకులైన ధర్మాన ప్రసాద్, బొత్స సత్యనారాయణలకు మంత్రివర్గంలో స్థానం కల్పించటం, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించారు. దీనికి తోడు జిల్లాలో తనకంటే ఎంతో జూనియర్‌ అయిన అనిల్ కింద తాను పని చేయాల్సి రావడాన్ని తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో ఆయన పార్టీ వీడక ముందే, వెంకటగిరి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ని ప్రకటించడం వంటి పరిణామాలు ఆనం రాంనారాయణ రెడ్డిని అవమానానికి గురి చేశాయి. దీంతో ఆయన పార్టీని వీడి, టీడీపీలో చేరారు.

MLA Mekapati Chandrasekhar Reddy: మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గంలో పలు గ్రూపులను వైసీపీ అధిష్ఠానం ప్రోత్సహించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఎప్పటినుంచో ఆయనను తప్పించాలని చూస్తోన్న వైసీపీ అధిష్ఠానం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌‌కు పాల్పడ్డారంటూ ఆయనను సస్పెండ్‌ చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

MLA Alla Ramakrishna Reddy: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయానికొస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై గెలుపొందినా ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం, చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై కేసులు వేసేందుకు మాత్రమే పావుగా వాడుకోవటం వంటి అంశాలు ఆళ్ల రామకృష్ణారెడ్డిని అసంతృప్తికి గురి చేసినట్లు ఓ వాదన వినిపిస్తోంది. వీటితోపాటు ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకు ఎంతో ఇబ్బందికి గురి చేసిందని, దాంతో నోరు మెదపలేక ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించడంతో సొంతవర్గం వారు వేధించడం, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసినా ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేకపోవడంతోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం.

Sitting MLA Tippala Nagireddy: చివరగా, గాజువాక టికెట్‌ ఆశించి పని చేసుకుంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫోన్‌ స్విచాఫ్‌ చేయటం గాజువాకలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే తనయుడు దేన్‌రెడ్డి తన తండ్రికి, కుటుంబానికి వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఇంఛార్జ్‌గా దేవన్‌ రెడ్డిని కాకుండా వేరొకరిని నియమించడం వంటి పరిణామాలు పార్టీని వీడేలా చేశాయి.

Dissatisfaction among YCP Leaders: ఇలా ఒక్కొకరుగా పార్టీని వీడడం చూస్తుంటే నమ్ముకున్నోళ్లనే సీఎం జగన్ నట్టేట ముంచాడనే అభిప్రాయం సొంత సామాజికవర్గం నేతల్లో గట్టిగా వినబడుతోంది. అయితే, సొంత సామాజికవర్గం నేతల పరిస్థితే ఇలా ఉంటే వైసీపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతల పరిస్థితి ఎలా ఉండబోతుందోనని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

మంగళగిరి 'స్వాతిముత్యం' మనసు ఎందుకు విరిగింది ? మరి జలగన్న కామన్​ మ్యాన్​కు నచ్చుతాడా ?!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.