ETV Bharat / state

'ఎకరాకు రూ.25 లక్షలివ్వండి.. అన్నీ నేను చూసుకుంటా'

author img

By

Published : Jan 1, 2023, 11:58 AM IST

Attempt to Encroach Temple Lands: ఆలయ భూములను కూడా వదిలే విధంగా లేరు ఆక్రమణదారులు. వీరితో ఓ ప్రజాప్రతినిధి చేయి కలిపాడు. ఇంకేం ఉంది.. అధికారులపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అనధికార మార్గంలో ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం కవులూరులో సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ భూములను తన సొంతం చేసుకోవాలనుకున్నారు.

temple lands
ఆలయ భూములు

Attempt to Encroach Temple Lands: అక్కడ ఎకరా ప్రభుత్వ ధర ప్రకారమే రూ.58.50 లక్షలు. బహిరంగ మార్కెట్‌ విలువ రూ.కోటి వరకు పలుకుతోంది. ఆ భూముల మీదుగా విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ జాతీయరహదారి నిర్మాణం కానుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి కన్ను దానిపై పడింది. వాస్తవానికి అవి దేవాదాయ శాఖ భూములు. కొంతమంది ఆక్రమణలో ఉన్నాయి. ఆక్రమించిన వారిలో ఓ ప్రవాస భారతీయుడూ ఉన్నారు. ‘ప్రభుత్వంలో అన్నీ నేను చూసుకుంటాను. ఎకరా రూ.25 లక్షలకు ఇవ్వండి..!’ అని ఆక్రమణదారులతో ఆ ప్రజాప్రతినిధి అనధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. దాదాపు 29 ఎకరాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రెవెన్యూ, దేవాదాయ శాఖలో ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారులపై ఒత్తిడి పెంచారు. ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం కవులూరులో సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ భూముల పరిస్థితి ఇది.

నిషేధిత జాబితాలో(22ఏ)లోనే ఉన్నా..: ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం కవులూరులో సంతాన వేణుగోపాలస్వామి దేవాలయాన్ని రాజా వెంకటాద్రి నాయుడు 1770లోనే నిర్మించారు. నాట్యకత్తెలకు ఇనాం భూములుగా 90 ఎకరాలు ఇచ్చారు. 78.58 ఎకరాలు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కింది. మిగిలిన భూమిని నమోదు చేయకపోవడంతో పలువురు ఆక్రమించి హక్కులు పొందారు. సర్వే నంబరు 278లో 17.60, 376లో 23.60, 460లో 8.37 ఎకరాలు, 300లో 29.01 ఎకరాల విస్తీర్ణం ఉంది. దీనిలో సర్వే నంబరు 300లోని భూములు నాట్యాచార్యులు, వారి కుటుంబాలకు ఇనాం భూములుగా ఇచ్చారు. ఆయా కుటుంబాలు ఈ భూములను వదిలేసి వెళ్లిపోయాయి. వీటిని కొనుగోలు చేసినట్లు కొందరు దస్త్రాలు తీసుకున్నారు. వారికి రైత్వారీ పట్టాలు రాలేదు. దేవాదాయ శాఖ ఆస్తుల రిజిస్టర్‌ 43 ప్రకారం ఆ శాఖ భూములుగానే ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లోనూ దేవాదాయ శాఖ భూములు, నిషేధిత జాబితాలో(22ఏ)లోనే ఉన్నాయి. 2012 డిసెంబరులో ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వీటిని వేరే వ్యక్తుల పేరు మీద రిజిస్టర్‌ చేశారు. తర్వాత ఇదే భూమిలో 9 ఎకరాలను ఒక ప్రైవేటు సంస్థకు విక్రయించారు. దీనిపై దేవాదాయ శాఖ ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు చేయగా రూ.1.25 లక్షలు లీజు చెల్లించాలని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుకు వెళ్లి ఆ సంస్థ స్టే ఉత్తర్వులు పొందింది. ఈ భూమి యాజమాన్య హక్కులు నిర్ణయించాలని రెవెన్యూ కోర్టులో, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో 2021 జనవరిలో దేవాదాయశాఖ ఈ పిటిషన్‌ వేసింది.

ఓ ప్రజాప్రతినిధి రంగప్రవేశం: మిగిలిన 20 ఎకరాలకు 14 మంది అనుభవదారులుగా ఉన్నారు. వీరికి రెవెన్యూ పట్టాలు ఇచ్చారు. వివాదం ఎదుర్కోవడం ఇష్టం లేకనో.. ప్రజాప్రతినిధి ఒత్తిడి వల్లనో.. ఎకరా రూ.25 లక్షలకు విక్రయించేందుకు అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా పూర్తి యాజమాన్య హక్కులు లభించిన తర్వాతే ఆ ప్రజాప్రతినిధి పేరు మీదకు మార్చాల్సి ఉంటుంది. రెవెన్యూలో, దేవాదాయ శాఖలో ఎన్‌ఓసీ పొంది క్లియరెన్సు పొందే బాధ్యత ఆ ప్రజాప్రతినిధిదే. ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ఈ ప్రాంతం మీదుగా వెళ్తోంది. దీనికి 45 సెంట్లను సేకరిస్తున్నట్లు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఎకరా 1.50 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధి దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసి క్లియరెన్సు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.