Surya grahanam 2022: రాష్ట్రంలో సూర్యగ్రహణ పాక్షికంగా కనిపించింది. హైదరాబాద్‌లో 4.59 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6గంటల 26 నిమిషాలకు ముగిసింది. పలుచోట్ల ప్రజలు టెలిస్కోప్‌లతో గ్రహాన్ని వీక్షించారు. ప్రారంభంలో పసుపు వర్ణంలో ఉన్న సూర్యుడు సూర్యగ్రహణం పూర్యయ్యే సరికి ఎరుపు వర్ణంలోకి మారింది. ఈ అద్భుత దృశ్యాన్ని ప్రజలు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని ఆసక్తిగా తిలకించారు.
హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం వద్ద గ్రహాణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్దలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. దాదాపు 25ఏళ్ల తర్వాత దీపావళి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడిందని, ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఔత్సాహికులు భారీగా తరలివచ్చారు. ఇందుకోసం రెండు భారీ టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. క్యూలైన్‌లో నిల్చొని ఒక్కొక్కరు టెలిస్కోప్ ద్వారా గ్రహణాన్ని వీక్షించారు.
టెలిస్కోప్‌ను ప్రొజెక్టర్‌కు అనుసంధానం చేసి తెరపైనా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. మరికొందరు బ్లాక్ కలర్ ఫిల్మ్ ద్వారా గ్రహణాన్ని వీక్షించారు. గ్రహణం అంటే ఏమిటి? గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి? అనే విషయాలపై ఈ సందర్భంగా బిర్లా ప్లానిటోరియం సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెలిస్కోప్ ద్వారా నేరుగా సూర్య గ్రహణం వీక్షించడం కొత్త అనుభూతినిచ్చిందని పలువురు ఔత్సాహికులు తెలిపారు.
పట్టు, విడుపు స్నానాలు.. గ్రహదోష నివారణ పూజలు.. సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నింటినీ మూసివేశారు. సంప్రోక్షణ తర్వాత భక్తులను తిరిగి దర్శనానికి అనుమతించనున్నారు. గ్రహణం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రహణం పట్టు విడుపు స్నానాలు ఆచరించారు.అనంతరం గ్రహణ దోష పరిహారాలను నిర్వహించారు.
ఇవీ చదవండి: