ETV Bharat / state

కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై కమిషన్​ ఏర్పాటు - commission on stampede incidents

Guntur Stampede : కందుకూరు, గుంటూరు జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం కమిషన్​ను ఏర్పాటు చేసింది. కందుకూరులో అభిమాన నేతను చూడాలని, గుంటూరులో చంద్రబాబు సభ ముగించుకుని వెళ్లిన తర్వాత కానుక పంపిణీ కార్యక్రమలలో ఈ తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై ప్రభుత్వం కమిషన్​ను ఏర్పాటు చేసింది.

Kandhukur Stampede
తొక్కిసలాట ఘటనలపై కమిషన్​
author img

By

Published : Jan 8, 2023, 6:44 AM IST

Kandhukur Stampede : కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శేషశయనారెడ్డిని కమిషనర్‌ ఆఫ్ ఎంక్వైరీగా నియమించింది. కమిషన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నెలరోజుల్లోగా విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి.. వాటికి బాధ్యులు ఎవరు.. ఏర్పాట్లలో ఏమైనా లోపాలు ఉన్నాయా.. అనుమతులు ఉల్లంఘనలు జరిగాయా అన్న అంశాలపై కమిషన్ విచారణ జరుపుతుందని ప్రభుత్వం తెలిపింది.అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపైనా కమిషన్ సిఫార్సులు చేయనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.