Inter Exams: ఇంటర్ మొదటి, రెండో సంవత్సర తుది పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. జనరల్, వొకేషనల్ కోర్సుల వారికి ఫిబ్రవరి 15, 2023 నుంచి మార్చి 3, 2023 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారాల్లో సైతం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఎథిక్స్, మానవ విలువలకు సంబంధించి మార్చి 4న, పర్యావరణ విద్యకు సంబంధించిన పరీక్ష మార్చి 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం వారికి, 16 మార్చి నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో సంవత్సరం వారికి రాత పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.
ఇవీ చూడండి..: