ETV Bharat / state

అనారోగ్యంతో కన్నుమూసిన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు - ఎమ్మెల్సీ బచ్చుల కన్నుమూత

Batchula Arjunudu : టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుముశారు. గుండెపోటుతో అసుపత్రిలో చేరిన అర్జునుడు ఈ రోజు తుది శ్వాస విడిచారు.

బచ్చుల అర్జునుడు
బచ్చుల అర్జునుడు
author img

By

Published : Mar 2, 2023, 10:42 PM IST

Batchula Arjunudu No more: టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుముశారు. గుండెపోటుతో అసుపత్రిలో చేరిన అర్జునుడు ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి చంద్రబాబు, లోకేశ్​, అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు సంతాపం తెలిపారు. అర్జునుడు మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.

Batchula Arjunudu No more : టీడీపీ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనవరి 28వ తేదీన ఆయనకు గుండెపోటు రావటంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి అర్జునుడు గురువారం తుదిశ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినవారు. శుక్రవారం ఆయన భౌతికకాయాన్ని స్వగృహానికి తరలించనున్నారు.

మార్చి 29తో బచ్చుల అర్జునుడి ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది.అర్జునుడు మరణించటంతో రేపు అమరావతిలో జరగాల్సిన టీడీపీ సమావేశం వాయిదా పడింది. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ సమావేశాన్ని వాయిదా వేశారు.

బ‌చ్చుల అర్జునుడు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. బచ్చుల అర్జునుడు మరణం అత్యంత విషాదకరమన్నారు. బచ్చుల అర్జునుడి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అర్జునుడు కుటుంబానికి తన సానుభూతి ప్రకటించారు. అర్జునుడి మృతిపట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సంతాపం ప్రకటించారు. అర్జునుడి మరణవార్త తనను దిగ్భాంత్రికి గురి చేసిందని తెలిపారు. అర్జునుడు నిజాయితీకి మారుపేరని.. అజాత శత్రువని గుర్తు చేశారు. టీడీపీ బలోపేతానికి అర్జునుడు ఎన‌లేని కృషి చేశారని వెల్లడించారు.

గన్నవరం తెదేపా కార్యాలయంలో బచ్చుల అర్జనుడు పార్ధీవదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. బచ్చుల కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చి.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. చంద్రబాబుతో పాటు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె, మాజీమంత్రి దేవినేని ఉమా, జిల్లా పార్టీ నేతలున్నారు.

బచ్చుల అర్జునుడి మృతి బాధాకరం.. ఇటీవలే కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించేందుకు వచ్చా.. ఇప్పుడు బచ్చులకు నివాళులర్పించేందుకు రావటం బాధాకరం.. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవయవాలు దెబ్బతినడం వల్ల అర్జనుడుని బతికించుకోలేకపోయాం.. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన అర్జనుడు అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగారు.. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.. ఎమ్మెల్సీగానూ అమరావతితో పాటు వివిధ అంశాలపై గట్టిగా పోరాడారు.. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గానూ విశేష సేవలందించారు.. గన్నవరం నియోజకవర్గ ఇన్​చార్జ్​ గానూ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించారు . -చంద్రబాబు, తెలుగుదేశం అధినేత

బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన సమయంలో చంద్రబాబు అర్జునుడుని పరామర్శించారు. అర్జునుడు తనను ఎప్పుడు విజయవాడ విమానాశ్రయం వచ్చినా కలిసేవాడని చంద్రబాబు తెలిపారు. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌గా టీడీపీ పార్టీకీ సేవలందించారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్​​ పోటీ చేసి విజయం సాధించారు. ఆయన వైసీపీలో చేరటంతో.. టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా పని చేసిన బచ్చుల అర్జునుడును గన్నవరం నియోజవర్గానికి ఇంఛార్జ్​గా నియమించారు. ఆయనకు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులతో సత్సంబంధాలు ఉండటంతో.. అధిష్టానం ఇంఛార్జ్​గా నియామిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనైతిక విధానాలను, నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తూ వచ్చారు. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని గతంలో ఆరోపించారు. పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధులు ఏం చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని అర్జునుడు పశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.