TDP Leaders Celebrations over CBN Interim Bail: టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ కేసులో హైకోర్టు మధ్యంత బెయిల్ మంజూరుపై.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తమ అధినేతకు బెయిల్ రావటంతో.. టపాసులు పేల్చుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయం ఎదుట ఆధ్వర్యంలో.. నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
Chandrababu Interim bail in Skill Case: తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో.. టపాసులు పేల్చారు. 'సైకో పోవాలి సైకిల్ రావాలి' అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం నేత వెనిగండ్ల రాము కార్యాలయంలో సంబరాలు జరిపారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.
Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
TDP Leaders Celebrations: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాసం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యకర్తలు.. బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టులో న్యాయం గెలిచిందంటూ.. నినాదాలు చేశారు. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి' అంటూ నినాదాలతో హోరెత్తించారు.
Celebrations over Chandrababu Interim Bail: తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ- జనసైనికులు కలిసి సంబరాలు నిర్వహించారు. కల్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు జనసైనికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. భారీ ఎత్తున హాజరైన తెలుగు యువత, కార్యకర్తలు పట్టలేనంత ఉత్సాహంతో చిందులు వేశారు. పట్టణంలోని టీ కూడలిలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు.
Celebrations over CBN Interim Bail in AP: వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లిలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో.. బాణాసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. 'జై చంద్రబాబు' అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
CBN Interim Bail Celebrations: ఇక నుంచి వైసీపీ నాయకులకు ఆట మొదలైందని.. చంద్రబాబు ఒకసారి జనం మధ్యలోకి వస్తే వారి పతనం ప్రారంభమవుతుందని శ్రీరామ్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోనూ తెలుగుదేశం శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. మేము సైతం బాబు వెంట అంటూ.. నినాదాలు చేశారు. రాష్ట్రంలో సైకో పాలనకు ప్రజలు చరమ గీతం పాడుతారన్నారు.