Nakka Anandababu: దళిత సమాజంపై ప్రభావంపడేలా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వ్యవహారశైలి ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో దళిత అధికారుల్ని బలిపశువుల్ని చేయాలనే కుట్రతో జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ ప్రజలకోసం పనిచేయకుండా వైకాపా అనుబంధ విభాగంగా పనిచేస్తోందని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి, సజ్జల ఆడమన్నదే ఆడటంగా సీఐడీ వ్యవహరించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలు ఇచ్చిన దాదాపు 300కుపైగా ఫిర్యాదుల్లో ఏ ఒక్కదానిపైనా సీఐడీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
ఇవీ చదవండి: