ETV Bharat / state

నేటి నుంచి టీడీపీ-జనసేన 'రా కదలి రా' బహిరంగ సభలు - tdp raa kadali raa

TDP-Janasena Come on Move Program Start Today: వైఎస్సార్​సీపీ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు టీడీపీ-జనసేన పార్టీలు నేటి నుంచి ‘రా కదలి రా’ పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించబోతున్నాయి. శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సభలు జరగనున్నాయి. రోజుకు రెండు చొప్పున నిర్వహించే ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేదా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌లు హాజరు కానున్నారని ఇరుపార్టీల నేతలు వెల్లడించారు.

tdp_programm
tdp_programm
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 6:58 AM IST

Updated : Jan 5, 2024, 2:55 PM IST

TDP-Janasena Come on Move Program Start Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేళం-జనసేన పార్టీలు 'రా కదలి రా' పేరుతో నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నాయి. రోజుకు రెండు చొప్పున నిర్వహించే ఈ బహిరంగ సభలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేదా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌‌లు హాజరు కానున్నారని ఇరుపార్టీల నేతలు వెల్లడించారు. ఈ బహిరంగ సభల ద్వారా వైఎస్సార్​సీపీ పాలనలో జరిగిన విధ్వంసాలు, అరాచకాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

Chandrababu Latest Visit Updates: తెలుగుదేశం-జనసేనలు పిలుస్తున్నాయి 'రా కదలి రా' అంటూ శుక్రవారం నుంచి నారా చంద్రబాబు నాయుడు సుమారు 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆనాడు ఎన్టీఆర్ 'రా కదలి రా' అంటూ ఇచ్చిన పిలుపుతో ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్లేలా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించింది.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీదే: చంద్రబాబు

TDP Public Meetings Updates: ఈ బహిరంగ సభల ద్వారా తెలుగుదేశం పార్టీ గత నాలుగున్నరేళ్లలో జరిగిన విధ్వంసం, అరాచకాలు, దాడులు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పిదాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించబోతుంది. నేటి నుంచి వరుస కార్యక్రమాలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ప్రజలకు స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు.

TDP Fire on CM Jagan Regime: రాష్ట్రాన్ని చీకటిమయం చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళనప్రదేశ్‌గా మార్చిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్సార్​సీపీ పాలనకు చరమగీతం పాడదామంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'రా కదలి రా పేరిట ఎన్నికల ప్రచార పర్వాన్ని ఈరోజు నుంచి మొదలుపెట్టారు. వరుసగా ఈ నెల 29 వరకు మొత్తం 22 పార్లమెంట్ స్థానాల్లో ఆయన పర్యటించి, బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. అయితే, తొలి సభను నేడు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి నుంచి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

TDP-Janasena Leaders Comments: ''అన్ని సభలు తెలుగుదేశం - జనసేన సంయుక్త ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కొన్ని సభల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు కలిసి పాల్గొంటారు. విశాఖ, నరసరావుపేట, హిందూపురం పార్లమెంట్ల్ సభల నిర్వహణ షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరుపేట, హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ధర్మవరంలలో జరిగే భారీ బహిరంగ సభలకు పవన్ కల్యాణ్ కూడా హజరవుతారు. పార్లమెంట్ స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మ్యానిఫెస్టో ప్రకటన దిశగా ఈ సభలు ప్రత్యేకంగా నిర్వహించనున్నాం.'' అని టీడీపీ- జనసేన నేతలు వెల్లడించారు.

CBN Kuppam Tour Updates: జగన్‌పై తిరుగుబాటు మొదలైంది.. తరిమేయడమే మిగిలింది: చంద్రబాబు

Helipad at Chandrababu Residence: ఈ క్రమంలో కొన్ని రోజులు రోజుకు రెండేసి బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉన్నందున రవాణా సౌకర్యార్ధం నారా చంద్రబాబు నాయుడు హెలికాఫ్టర్‌‌లో ప్రయాణించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దే హెలిప్యాడ్‌ను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. 2019లో తెలుగుదేశం అధికారం కోల్పోయిన నాటి నుంచి నిర్మానుష్యంగా మారిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చామని, రెండో బహిరంగ సభను 7 తేదీన విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంటల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Chandrababu Public Meetings Details: '9వ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డలో చంద్రబాబు నాయుడు సభలు నిర్వహిస్తారు. 10వ తేదీన విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని స్థానాల్లో బహిరంగ సభలు జరుపుతారు. 18వ తేదీన ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడలో భారీ సభ నిర్వహిస్తారు. 9వ తేదీన చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జీడీ నెల్లూరులో, కడప పార్లమెంట్ పరిథిలోని కమలాపురం నియోజకవర్గాల్లో సభలు పెడతారు. 20వ తేదీన అరకు పార్లమెంట్ పరిధిలోని అరకు వ్యాలీ, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేటలో సభలు జరుగుతాయి.' అని ఇరుపార్టీల నేతలు తెలిపారు.

24వ తేదీన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉరవకొండ. 25న నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కోవూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండ. 27న రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు. 28న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగలలో, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలి. 29ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని చీరాలలో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటాయి.-టీడీపీ నేతలు

Chandrababu Naidu chit chat: "జగన్ మూర్ఖత్వానికి రాష్ట్రం బలికావాలా..? త్వరలో పల్లె నిద్ర"

Last Updated : Jan 5, 2024, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.