ETV Bharat / state

మనీలాండరింగ్​ కేసు... సుకేశ్​ గుప్తా అరెస్ట్​.. 14రోజుల రిమాండ్​ - AP NEWS

Sukesh Gupta: మనీలాండరింగ్​ కేసులో సుకేశ్​ గుప్తాను రిమాండ్​కు తరలించారు. కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత.. నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సుకేశ్​ గుప్తాకు 14రోజుల రిమాండ్​ విధించడంతో ఈడీ అధికారులు చంచల్​గూడ జైలుకు తరలించారు.

Sukesh Gupta was arrested
సుకేశ్​ గుప్తానుకు అరెస్ట్
author img

By

Published : Oct 19, 2022, 7:57 PM IST

Sukesh Gupta was arrested in the money laundering case sent him to remand: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్​ అయినా సుకేశ్​ గుప్తాను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) అధికారులు రిమాండ్​కు తరలించారు. నాంపల్లి కోర్టు వచ్చే నెల 5వ తేదీ వరకు రిమాండ్​ విధించడంతో చంచల్​గూడ జైలుకు తరలించారు. నిన్న రాత్రి సుకేశ్​ను అరెస్ట్​ చేసిన ఈడీ అధికారులు.. అతని దగ్గర వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సీసీఎస్​ కార్యాలయంలో ఉంచారు. ఈరోజు ఉదయం 11గంటల సమయంలో సీసీఎస్​ నుంచి ఈడీ కార్యాలయానికి సుకేశ్​ గుప్తాను తీసుకొచ్చి అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సుకేశ్​ గుప్తాకు 14రోజుల రిమాండ్​ విధించడంతో ఈడీ అధికారులు చంచల్​గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్​ అండ్​ మినరల్స్​ ట్రేడింగ్​ కార్పొరేషన్​(ఎంఎంటీసీ) నుంచి ఎంబీఎస్​ జువెల్లర్స్​ 2011 వరకు భారీగా బంగారం కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.503కోట్లకు చేరింది. ఎంఎంటీసీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు. ఈడీ అధికారులు సైతం మనీ లాండరింగ్​ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గతేడాది ఆగస్టులో ఎంబీఎస్ జువెల్లర్స్​కు చెందిన 363కోట్ల రూపాయల ఆస్తులను సీజ్​ చేశారు. సుకేశ్​ గుప్తా.. ఇతరుల పేర్ల మీద మరోసారి బంగారం వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు విజయవాడ, హైదరాబాద్​ల​లోని షోరూమ్​లలో సోదాలు నిర్వహించారు. 100కోట్ల రూపాయల విలువ చేసే బంగారంతో పాటు, సుకేశ్​ గుప్తా, అనురాగ్ గుప్తా బినామీ ఆస్తులను సీజ్ చేశారు. మొత్తం 150 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలు, ఇతర స్థిరాస్తులను సీజ్​ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.