ETV Bharat / state

మీ ఓటు చెక్​ చేసుకోండి - 2, 3 తేదీల్లో ఓటర్ల నమోదు, తనిఖీ కార్యక్రమం

CEC Call for Special Voters Program : దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన అతి పెద్ద అస్త్రం ఓటు. ఆ ఒక్క ఓటుతో.. దేశ అభివృద్ధికి బాటలు పరచవచ్చు. అలాంటి ఓటును విపక్ష సానుభూతిపరులనే నేపంతో.. గ్రామంలో ఉన్నా లేరనే కారణంతో తొలిగిస్తున్నారు. వాటికి అడ్డకట్ట వేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్లు కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

vote_awareness_campaign
vote_awareness_campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 9:47 PM IST

CEC Call for Special Voters Program : రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 5న ప్రకటించే ఓటర్ల తుది జాబితా.. రూపకల్పన కోసం ఎన్నికల సంఘం.. ప్రత్యేక ఓటర్లు నమోదు, తనిఖీ కార్యక్రమాలను చేపట్టనుంది. డిసెంబరు 2,3 న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. తనిఖీ శిబిరాలను రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో.. ఏర్పాటు చెేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు.. ఓటరు జాబితా తనిఖీలను కూడా పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

Vote is the Strongest Weapon of the People in a Democracy : ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న బలమైన ఆయుధం ఓటు. ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం విస్తృతంగా కృషి చేస్తోంది. వచ్చే జనవరి 5వ తేదీన ప్రకటించే ఓటర్ల తుది జాబితా ఖరారు చేసే సమయానికి అందులో ఓటరుగా నమోదు కావడంతో పాటు.. ఓటు ఉందా లేదా తనిఖీ చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తోంది ఈసీ. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 2, 3న ఈ ప్రత్యేక తనిఖీ శిబిరాలను ఏర్పాటు చేయటంతో పాటు ఇంటింటికీ తిరిగి ఓటర్ల నమోదు, తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టనుంది ఎన్నికల యంత్రాంగం. రాష్ట్రంలో ఫాం 7 ద్వారా దురుద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో.. తుది ఓటర్ల జాబితా రూపొందేలోగా జాబితాలో పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవటంతో పాటు కొత్తగా ఓటు నమోదు కోసం కూడా డిసెంబరు 2,3 తేదీలు కీలకం కానున్నాయి.

ప్రత్యేకంగా ఇంటింటి తనిఖీ ద్వారా వచ్చే బీఎల్ఓలు, ఎన్నికల అధికారులకు వివరాలను సమర్పించటం ద్వారా ఓటు హక్కును పరిరక్షించుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే ఓటు అనే విలువైన హక్కును కాపాడుకునేందుకు పౌరులు కొన్ని నియమాలు పాటించాలని సూచనలు చేసింది. డిసెంబరు 2, 3 తేదీల్లో ఓటరు తనిఖీ, నమోదు కోసం వచ్చే ఎన్నికల సిబ్బందికి అందుబాటులో ఇంటి వద్దే ఉండాలని సూచిస్తోంది ఈసీ. దీంతో పాటు తనిఖీ కోసం వచ్చిన ఎన్నికల సిబ్బందికి చూపేందుకు సిద్ధంగా తగిన గుర్తింపు కార్డు ఉంచుకోవాలని పేర్కొంటోంది. జిల్లాల వారీగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టటంతో పాటు ఓటరు జాబితా తనిఖీలను కూడా పారదర్శకంగా నిర్వహించాలని సీఈఓ ఆదేశాలు జారీ చేశారు.

A Special Awareness Program : మరోవైపు సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ కూడా ఏపీలో ఓటరు నమోదు, ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ సంస్థ కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దుగ్గిరాలలో వినూత్నమైన సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టనున్నారు. దుగ్గిరాలలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓట్లు కోల్పోయిన కొందరు.. గాంధీ, అంబేడ్కర్ ఫొటోలతో మా ఓట్లు తొలగించవద్దని పేర్కొంటూ ప్లకార్డులు ప్రదర్శించాలని నిర్ణయించారు. ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో జాబితా నుంచి తొలగించిన 33 మంది ఓటర్ల నివాసాలకు నిమ్మగడ్డ వెళ్లి వారికి సంఘీభావం తెలిపి నిరసనలో పాల్గొనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.