Sanitation worker died falling down the Procline: విజయవాడ అజిత్సింగ్ నగర్ ఎక్సల్ ప్లాంట్ డంపింగ్ యార్డులో ప్రమాదవవశాత్తు ప్రొక్లెయిన్ కిందపడి కార్మికుడు మృతిచెందాడు. ఈ విషయం తెలిసి తోటి కార్మికులు, సీపీఎం నేతలు ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థకు చెందిన డంపింగ్ యార్డ్లో ప్రమాదవశాత్తు చెత్త ఎత్తే మినీ ప్రొక్లెయిన్ కింద పడి రాజేష్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రభుత్వం మృతుడు కుటుంబానికి వెంటనే 25 లక్షల నష్ట పరిహారం ప్రకటించాలని, సీపీఎం నాయకులతో కలిసి కార్మికులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
డంపింగ్ యార్డ్లో ప్రమాదం.. కార్మికుడు మృతి - పారిశుధ్య కార్మికుడు మృతి
Sanitation worker died: డంపింగ్ యార్డ్లో ప్రొక్లెయిన్ ప్రమాదంలో రాజేష్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడ అజిత్సింగ్ నగర్లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులతో పాటుగా సీపీఎం నేతలు ఆందోళన చేశారు. వెంటనే రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.