ETV Bharat / state

'సాయంత్రంలోపు మినిట్స్‌ ఇవ్వకపోతే.. తలపెట్టిన ఉద్యమం కొనసాగుతుంది'

AP JAC Amaravati members met with AP CS: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ లిఖితపూర్వకంగా ఇస్తేనే.. రేపటి నుంచి తలపెట్టిన ఆందోళన విరమణపై ఆలోచిస్తామని.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈరోజు రాత్రి వరకూ.. నిన్నటి సమావేశంలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీ మేరకు.. మార్చి నెలాఖరులోపు పెండింగ్‌లో ఉన్న ఆర్ధిక అంశాలను పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా రాసివ్వాలని సీఎస్‌ను కోరామని, లేనిపక్షంలో రేపు తలపెట్టిన నల్ల రిబ్బన్ల నిరసన కొనసాగుతుందని.. సీఎస్ జవహర్ రెడ్డికి స్పష్టంగా వివరించామని.. బొప్పరాజు మీడియా ముందు భేటీ వివరాలను వెల్లడించారు.

AP ICASA
AP ICASA
author img

By

Published : Mar 8, 2023, 4:23 PM IST

AP JAC Amaravati members met with AP CS: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ లిఖితపూర్వకంగా ఇస్తేనే.. రేపటి నుంచి తలపెట్టిన ఆందోళన విరమణపై ఆలోచన చేస్తామని.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల పెండింగ్ అంశాలకు సంబంధించి నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డితో ఏపీ ఐకాస అమరావతి ప్రతినిధులు భేటీ అయ్యారు.

భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈరోజు రాత్రి వరకూ.. నిన్నటి సమావేశంలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీ మేరకు.. మార్చి నెలాఖరులోపు పెండింగ్‌లో ఉన్న ఆర్ధిక అంశాలను పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా రాసివ్వాలని సీఎస్‌ను కోరామని, లేనిపక్షంలో రేపు తలపెట్టిన నల్ల రిబ్బన్ల నిరసన కొనసాగుతుందనే అంశాన్ని.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డికి స్పష్టంగా వివరించామని బొప్పరాజు తెలిపారు. సీఎస్‌ సూచన మేరకే ఈరోజు క్యాంపు కార్యాలయానికి వెళ్లామన్నారు.

అనంతరం పీఆర్సీ బకాయిలు, కొత్త డీఏలు వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, లిఖితపూర్వకంగా మినిట్స్‌ రూపంలో ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని స్పష్టంగా కోరామన్నారు. దానికి ఆయన ఈరోజు సాయంత్రంలోపు మినిట్స్‌ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. సాయంత్రంలోపు మినిట్స్‌ ఇస్తే రేపు ఉదయం కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో మధ్యాహ్నంకల్లా ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ సాయంత్రంలోపు మినిట్స్‌ గనక ఇవ్వకపోతే.. యథావిధిగా తమ కార్యాచరణ సాగుతుందని బొప్పరాజు పేర్కొన్నారు.

మినిట్స్‌ విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోయినా, ఇవ్వకపోయినా ఏం చేయాలనేది దానిపై రేపు మధ్యాహ్నం వరకూ అన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా లిఖితపూర్వక హామీ మినిట్స్‌ రూపంలో రావాల్సిందేనని ఏపీ ఐకాస అమరావతి ప్రతినిధులు స్పషం చేశారు. ఇక, ఈరోజు సీఎస్ జవహర్ రెడ్డితో జరిగిన భేటీలో పలు ముఖ్యమైన విషయాల గురించి చర్చించామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

సాయంత్రంలోపు మినిట్స్‌ ఇవ్వకపోతే.. ఉద్యమం కొనసాగుతుంది

''పెండింగ్ బిల్లులు 3 దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్‌ను కోరాం. సాయంత్రంలోపు చర్చల మినిట్స్ ఇస్తామని సీఎస్ స్పష్టం చేశారు. సాయంత్రంలోగా మినిట్స్ ఇస్తే రేపటి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. సాయంత్రంలోగా మినిట్స్ ఇవ్వకుంటే యథావిధిగా ఉద్యమ కార్యాచరణను చేపడతాం. మినిట్స్ ఇస్తే ఉద్యమాన్ని రేపు మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తాం. మినిట్స్ ఇచ్చాక కూడా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మా అజెండా నుంచి పక్కకు వెళ్లేదిలేదు.'' -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.