PAG Latest Reports on Ambulance Services : జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రభుత్వం 108 అంబులెన్సులు నడపడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి 50వేల మంది జనాభాకు ఒక అంబులెన్సు ఉండాల్సి ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం 65 వేల 249 జనాభాకు ఒకటి మాత్రమే నడుపుతున్నారు. మాతా, శిశు మరణాల సంఖ్య తగ్గింపు చర్యల్లో భాగంగా 279 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతున్నారు. ఈ పథకం కింద ఇంటి నుంచి ఆసుపత్రికి గర్బిణులను..ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటికి చేర్చాలి.
Ambulance Services Situation in State : 2017-22 మధ్య ప్రభుత్వాసుపత్రుల్లో 36 లక్షల 73 వేల ప్రసవాలు జరిగితే..కేవలం 10లక్షల 17 వేల మంది తల్లులను మాత్రమే ఈ వాహనాల ద్వారా ఇళ్లకు చేర్చారు. 26 లక్షల 56వేల మంది తల్లులు ఈ సౌకర్యాన్ని పొందలేకపోయారని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ప్రధాన కార్యాలయం పేర్కొంది. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య వైద్య, ఆరోగ్య శాఖ పనితీరును PAG విశ్లేషించింది. ఇందులో అత్యవసర సేవలు, నిర్వహణ తీరులో భాగంగా 108 అంబులెన్సుల పనితీరు, కొవిడ్ సమయంలో అత్యవసర చికిత్స కోసం వచ్చిన పరికరాలు, యంత్రాల వినియోగం ఆసుపత్రుల్లో ఎలా ఉందన్న దానిపైనా అధ్యయనం చేసింది.
Man Dies Due To Delay In Arrival Of Ambulance 108 వాహనం ఆలస్యమైంది.. వ్యక్తి ప్రాణాలు పోయాయి
PAG Study on Ambulance Services in AP : రాష్ట్రంలో అత్యవసర సర్వీసుగా పిలిచే 108 సేవలు జనాభాకు సరిగ్గా అందడం లేదని పీఎజీ తాజా నివేదికల్లో తేలింది . పట్టణ ప్రాంతాల్లో 20 నిమిషాలకు ప్రమాద ఘటన స్థలానికి అంబులెన్సు చేరుకోవాల్సి ఉన్నా.. 3.23 నిమిషాల ఆలస్యంగా చేరుకుంటుందని లెక్కలు చెబుతున్నాయి. దీనికి జరిమానాలు విధిస్తున్నాసమయానికి సంఘటన స్థలానికి అంబులెన్సులు చేరుకోకుంటే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని పీఎజీ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినప్పుడు నిర్దేశించిన సమయం కంటే ముందుగానే వివరాల సేకరణ జరుగుతుందని పేర్కొంది.
కొండలు, గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రతి 20వేల జనాభాకు ఒక పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం 159 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో 84 అంబులెన్సులు, 122 ఫీడర్ అంబులెన్సులు నడుస్తున్నాయి. కానీ ప్రతి పీహెచ్‌సీకి ఒకటి చొప్పున 108 అంబులెన్సు ఉండాల్సిన అవసరం ఉందని పీఎజీ వెల్లడించింది. సీతంపేట ఏరియా ఆసుపత్రిలోని బేసిక్ లైవ్ సపోర్టు అంబులెన్సును పరిశీలించినప్పుడు అందులో ఎయిర్ ఫ్లో మీటర్ లేదు. రోగికి సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ ఇచ్చే సమయంలో ఎయిర్ ఫ్లో మీటర్ ఉపయోగిస్తారని పీఎజీ తెలిపింది.
రోగితో వెళ్తున్న అంబులెన్స్ బ్రేక్ డౌన్
108కి అదనంగా బోధనాసుపత్రులకు అనుసంధానంగా ఉన్న అంబులెన్సులు చాలా చోట్ల మరమ్మతులకు గురై ఉన్నట్లు పీఏజీ తెలిపింది. అనంతపురం బోధనాసుపత్రిలో 8 అంబులెన్సుల ఉండగా వీటిలో ఆరు పనిచేయడం లేదు. శ్రీకాకుళం బోధనాసుపత్రిలో ఆరింటికి గాను మూడు, నెల్లూరులో ఎనిమిదికి.. ఒకటి చొప్పున అంబులెన్సులు పనిచేయడం లేదు. అనంతపురం, నెల్లూరు బోధనాసుపత్రుల్లోని అంబులెన్సుల్లో N.A.B.H. ప్రమాణాల ప్రకారం పరికరాలు లేవని పీఏజీ గుర్తించింది.
108 vehicle on Road: జాతీయ రహదారిపై ఆగిన 108 వాహనం.. పట్టించుకోని అధికారులు
కాల్ రీసివింగ్ రిజిస్టర్‌ను నిర్వహించడంలేదని తనిఖీల్లో తేలింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబరేటరీ ఏర్పాటు కోసం 2021లో వచ్చిన సామగ్రి వృథాగా పడి ఉందని అధికారులు గుర్తించారు. ఈ లేబరేటరీ ఇక్కడ వద్దకున్నప్పటికీ ఖరీదైన సామగ్రిని మాత్రం అక్కడే ఉంచారు.
సీతంపేట, నాయుడుపేట, సోంపేట ఆసుపత్రులకు అదనంగా పీడియాట్రిక్ ఐసీయూల కోసం వచ్చిన వెంటిలేటర్లు 2022 జనవరి, ఫిబ్రవరి నుంచి వృథాగా అక్కడే ఉన్నాయి. వీటిని ఉపయోగించే సామర్థ్యం కలిగిన సాంకేతిక నిపుణులు లేకపోవడం, స్థలాభావమే ఇందుకు కారణం. నెల్లూరు జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల అవసరాల కోసం వచ్చిన 623 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వినియోగించడంలేదు. వీటిని అవసరమైన ఇతర ఆసుపత్రులకు పంపడం లేదని పీఎజీ తనిఖీల్లో తేలింది. ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు కాన్సన్‌ట్రేటర్లను అవసరమైన ఆసుపత్రులకు పంపించాలని లేఖ రాసినట్లు నెల్లూరు జిల్లా అధికారులు పీఏజీకి తెలియచేశారు.
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థతో సంప్రదించకుండానే నేరుగా 2020లో జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి 51 లక్షల 80 వేలు వెచ్చించి 10 ఎక్స్‌రే యూనిట్లు, ఈసీజీ మిషన్లను కొనుగోలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రికి 2021 సెప్టెంబరులో ఆక్సిజన్ జనరేటర్ చేరుకున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి సందర్శనలో ఇంకా వాడుకలోకి రాలేదు. కొనుగోలు ఆర్డర్ రానందున జనరేటర్‌ను ఇంకా అమర్చలేదని ఆసుపత్రి అధికారులు పీఎజీకి సమాధానం ఇచ్చారు. పీఏజీ పరిశీలించిన ఆసుపత్రుల్లో 10 ఆక్సిజన్ ప్లాంట్లలో ఆరు పనిచేయడం లేదు. నెల్లూరు, శ్రీకాకుళం బోధనాసుపత్రులు, నాయుడుపేట, కావలి, కదిరి, సీతంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి కనిపించిందని పీఏజీ వెల్లడించింది.