ETV Bharat / state

ఎన్‌టీఆర్‌ జిల్లా: కంచికచర్లలో విద్యార్థుల మధ్య ఘర్షణ - students fight

ఎన్‌టీఆర్‌ జిల్లా: కంచికచర్లలో విద్యార్థుల మధ్య ఘర్షణ

author img

By

Published : Apr 11, 2022, 7:47 PM IST

Updated : Apr 11, 2022, 9:46 PM IST

19:44 April 11

సీనియర్‌ విద్యార్థిపై జూనియర్‌ విద్యార్థి, అనుచరుల దాడి

విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తడంతో.. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. ఈ ఘటన కంచికచర్లలోని మిక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చోటు చేసుకుంది. సామాజిక మాధ్యమంలో పోస్టు విషయమై తలెత్తిన వివాదం.. చినికి చినికి గాలివానలా మారింది. సీనియర్‌ విద్యార్థిపై జూనియర్‌ విద్యార్థి, అతని అనుచరులు దాడి చేశారు. బీరు సీసాలు, బ్యాట్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న నందిగామ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

నాకు మంత్రి పదవి రాకుండా చేసింది వారే : ఎమ్మెల్యే సామినేని

Last Updated : Apr 11, 2022, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.