AP CM Jagan attends NITI Aayog meeting: దేశ రాజధాని దిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతీ ఆయోగ్ పాలక మండలి 8వ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ‘వికసిత్ భారత్ @2047’ అనే థీమ్‌తో నిర్వహించారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశం అభివృద్ధి చెందే దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధి, మహిళా సాధికారత, మౌలికసదుపాయల వృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి పాలక మండలిలో సభ్యులుగా ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతోపాటు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్రం ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం భేటిలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రగతిపై నోట్ సమర్పణ.. ఈ సందర్భంగా సీఎం జగన్.. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం నీతి ఆయోగ్ చర్చించే అంశాల్లో భాగంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని గురించి వివరించిన ఓ నోట్‌ను సమావేశానికి సమర్పించారు. భారత్‌లో లాజిస్టిక్ రంగం చేస్తున్న వ్యయం ఎక్కువగా ఉందని, ప్రపంచ స్థాయిలో భారత ఉత్పత్తులు పోటీ పడేందుకు ఇది ప్రతిబంధంకం అవుతోందని ముఖ్యమంత్రి జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం ప్రగతిని సాధించాలంటే అన్ని రాష్ట్రాలూ కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరముందని ఆయన తెలిపారు.
Jagan met Nirmala: కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం జగన్ భేటీ.. అందుకేనా..!
4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం.. అనంతరం దేశంలో సరకు రవాణా కారిడార్‌లు, జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం చేస్తున్న వ్యయం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కూడా పోర్టు ఆధారిత అభివృద్ధిపై దృష్టి పెట్టిందని.. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోందన్నారు. అలాగే, విశాఖపట్టణంలో పీపీపీ ప్రాతిపదికన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోనూ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామన్నారు. జీడీపీ పెరుగుదలలో సేవలు-తయారీ రంగం సేవల రంగాలే కీలకమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు సరికొత్త సాంకేతికతను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. అటు పరిశ్రమల పరంగా రాష్ట్రం (ఏపీ) మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. వాడుకలోలేని చట్ట నిబంధనల్ని రద్దు చేశామని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.
'2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఉమ్మడి ప్రణాళిక'.. నీతి ఆయోగ్‌లో మోదీ
6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం.. చివరగా గతకొన్ని రోజలక్రితం విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గురించి సీఎం జగన్ ప్రస్తావించారు. సమ్మిట్ ద్వారా రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారంపై దృష్టిపెట్టామన్నారు. వైద్యరంగంలో కీలకమైన సంస్కరణలు చేశామని వెల్లడించారు. దీర్ఘకాలిక, సంక్రమించని వ్యాధుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో విలేజ్ క్లీనిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానాల్ని అనుసరిస్తున్నట్టు వివరించారు. టెరిషరీ హెల్త్ కేర్‌పై శ్రద్ధపెడుతున్నామన్న జగన్.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా డైనమిక్ పాఠ్యాంశాలను విద్యార్ధులకు అందించాలని సూచించారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మహిళల ఆర్ధిక ప్రగతికి కృషి చేస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా పని చేస్తే.. ప్రతి రాష్ట్ర శ్రేయస్సు మొత్తం దేశంతో ముడిపడి ఉంటుందని సీఎం జగన్ భేటీలో వ్యాఖ్యానించారు.
Jagan Review on NITI Aayog: 27న దిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం.. పలు అంశాలపై సీఎం సమీక్ష