ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల కస్టడీకి పిటిషన్ వేయనున్న పోలీసులు - బెయిల్ పిటిషన్

Buying TRS MLAs Issue: తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో... నిందితులను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

TRS MLAs Issue
ఎమ్మెల్యేలకు ఎర కేసు
author img

By

Published : Nov 9, 2022, 12:31 PM IST

Buying TRS MLAs Issue: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిందితులను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయనున్నారు.

ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిందితులు... బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. రామచంద్ర భారతిపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో నమోదైన కేసులోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెరాస ఎమ్మెల్యేలకు ఎర వేశారన్న అభియోగాలపై అక్టోబరు 26న రామచంద్ర భారతితో పాటు సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. రామచంద్ర భారతికి ఒకటికి మించి పాన్‌, ఆధార్‌ కార్డులు ఉన్నట్లు ఈ నెల 3న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. కార్డుల్లో నంబరు ఒకటే ఉన్నా తండ్రి పేరు, పుట్టిన తేదీ వేర్వేరుగా ఉన్నట్లు తేలింది. దీనిపై నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. ఈ క్రమంలోనే రామచంద్ర భారతిపై బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ 467, 468, 420, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.