ETV Bharat / state

కిడ్నాప్​ అయిన పసిపిల్లాడి ఆచూకీ లభ్యం.. ఎందుకు ఎత్తుకెళ్లారంటే..!

Kidnapped baby found at vikarabad: అభంశుభం తెలియని చిన్నారిని ఎత్తుకొని వెళ్లి యాచక వృత్తిలో దించుదామనుకున్నారు ఇద్దరు మహిళలు. అనుకున్నట్లుగానే పసిపాపాయిని దొంగిలించారు. కానీ పోలీసుల బారినుంచి తప్పించుకోలేకపోయారు.

కిడ్నాప్​ అయిన పసిపిల్లాడి ఆచూకీ
Kidnapped baby found
author img

By

Published : Nov 17, 2022, 10:12 PM IST

Kidnapped baby found at vikarabad: తెలంగాణలోని ఈ నెల 6వ తేదీన హైదరాబాద్​లోని హుమాయున్ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చిన్నారిని దొంగిలించిన సంఘటన చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్​ నంబర్​ 13 వద్ద ఒక యాచకురాలు భిక్షాటన చేస్తూ.. తన 14 నెలల బాబును పోషించుకుంటోంది. అయితే అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. తన బాబు గురించి హుమాయున్ నగర్​ పోలీస్​లను​​ ఆశ్రయించింది ఆ తల్లి.

ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్పెషల్​ టీమ్​లుగా ఏర్పడ్డారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వికారాబాద్​ వైపు ఇద్దరు వ్యక్తులు బాబును తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు వికారాబాద్​ రైల్వే స్టేషన్​లో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పసిపిల్లాడిని తీసుకొని యోగక్షేమాలను చూసుకున్నారు. అదుపులోకి తీసుకొన్న ఇద్దరు మహిళలు దస్తమ్మ, లక్ష్మీలుగా గుర్తించారు. దొంగలించిన చిన్నారిని భిక్షాటన కొరకు వాడుకోవాలని చూశారని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. పిల్లవాడిని తల్లికి అప్పగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.