Jana Sena Kiran Royal vs R.K.Roja: తిరుపతి జనసేన నేత కిరణ్‌రాయల్‌కు చెందిన సెల్‌ఫోన్‌లోని సమాచారాన్ని.. బయటకు తీయవద్దని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ, తిరుపతి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు ఆదేశిస్తూ..విచారణను డిసెంబర్2కు వాయిదా వేసింది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో..కిరణ్‌రాయల్‌తో పాటు మరికొందరిపై నగరి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ.. కిరణ్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాదనలు విన్న ధర్మాసనం తమ అనుమతి లేకుండా ముందుకెళ్లొద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ఉత్తర్వులిచ్చారు. కిరణ్‌రాయల్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నసెల్ ఫోన్.. మెజిస్ట్రేట్ కోర్టు ఆధీనంలో ఉందని పిటీషనర్ తరుపున న్యాయవాది జడ శ్రావణ్ కోర్టుకు తెలిపారు.
ఇవీ చదవండి: