Salaries For Doctors కరోనా సమయంలో వైద్య సేవలు అందించిన వైద్యులకు ప్రభుత్వం జీతాలు అందకపోవటంపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా సమయంలో వైద్య సేవలు అందించిన వైద్యులకు జీతాలు అందకపోవటంతో.. వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు, జీతాలు చెల్లించకపోవటంపై ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో ఆయన ఈ నెల 9లోగా జీతాలు అందిస్తామని తెలిపారు. 9వ తేదీ తర్వాత జీతాలు చెల్లించకుంటే.. జాప్యానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: