ETV Bharat / state

గ్రానైట్​ మాఫియా అక్రమాలు.. పన్నులు ఎగ్గొట్టి తరలింపు..

author img

By

Published : Oct 28, 2022, 7:20 AM IST

Granite: రూపాయి పెట్టుబడి లేకుండానే లక్షలాది రూపాయల సంపాదన.. ఏరోజుకు ఆరోజు డబ్బులు వచ్చి జేబులో పడిపోతాయి.. గ్రామ సరిహద్దుల ఆధారంగా ఎవరెవరికి ఎంతెంత చేరాలో అంత చేరిపోతాయి.. బెదిరింపులే పెట్టుబడిగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సాగుతున్న గ్రానైట్‌ దందా ఇది. సక్రమంగానే వ్యాపారం చేస్తున్నా.. ఇక్కడ నేతలకు మామూళ్ల సమర్పించాల్సిందే. లైన్‌ మామూళ్ల పేరిట ఓ సమాంతర వ్యవస్థే నడుస్తుంటుంది ఇక్కడ. ప్రభుత్వానికి పన్ను చెల్లించినా.. చెల్లించకపోయినా పర్వాలేదు కానీ.. నేతలకు మామూళ్లు మాత్రం ఠంచన్‌గా చేరిపోవాల్సిందే.

Granite Mining Mafia
గ్రానైట్​ మాఫియా
రాష్ట్రంలో గ్రానైట్​ మాఫియా అక్రమాలు

GRANITE MAFIA IN AP : బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో స్టీల్‌గ్రే, బ్లాక్‌పెరల్‌ గ్రానైట్ విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 700కుపైగా గ్రానైట్‌ పరిశ్రమల నుంచి సగటున రోజుకు వంద లారీలకుపైగా సరకు రవాణా అవుతోంది. ఒక్కొక్క లారీలో ఐదువేల అడుగుల గ్రానైట్ పలకలు తరలిస్తారు. అయితే ఇందులో సగానికి కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించడం లేదు. నిబంధనల ప్రకారం ఒక్కో అడుగుకు భూగర్భగనులశాఖకు 12 రూపాయలు, మొత్తం సరుకు విలువలో వస్తు సేవల పన్ను రూపేణా 18శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో లారీ నుంచి ప్రభుత్వానికి దాదాపు లక్ష రూపాయల వరకు ఆదాయం సమకూరుతుంది. రోజుకు కోటి రూపాయల వరకు ఆదాయం రావాల్సి ఉన్నా.. లక్షల్లో మాత్రమే వస్తోంది. మిగిలిన సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది.

ప్రభుత్వానికి చెల్లించే సొమ్ములో మూడో వంతు అంటే 30వేలు గ్రానైట్‌ మాఫియాకు చెల్లిస్తే చాలు.. మూడు జిల్లాల సరిహద్దులు దాటించే బాధ్యత లైన్‌ పర్యవేక్షించేవారు తీసుకుంటారు. ఎక్కడికక్కడ పైలట్‌ బృందాలను ఏర్పాటు చేసుకుని జిల్లా సరిహద్దులను దాటించేస్తున్నారు. వీరికి పోలీసు, రవాణా, భూగర్భగనుల శాఖలో కొందరు లోపాయికారీగా సహకరిస్తున్నారు. ఇక్కడి యంత్రాంగం పూర్తిగా నేతల కనుసన్నల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడి ఓ పోలీసుస్టేషన్‌లో ఏడాది బాధ్యతలు పూర్తవ్వకుండానే.. మరొకరు ఆ సీటులోకి వచ్చేందుకు పైరవీలు చేస్తారంటే అక్రమ ఆదాయం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.

ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కీలకంగా ఉన్న నేతలు నేరుగా జోక్యం చేసుకోకుండా వారి పరిధిలో అనుచరులను నియమించుకుని వసూళ్ల బాధ్యతలను అప్పగించారు. ఇలా వసూలుచేసే మొత్తానికి ‘లైన్‌ మామూళ్లు’ అని పేరు పెట్టుకున్నారు. సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, మద్దిరాల వద్ద ఆయా మార్గాల్లో లైన్‌ మామూళ్లు వసూలవుతున్నాయి. ఆయా నేతల పరిధిలో వేర్వేరు మార్గాల్లో ఉన్న లైన్‌లో ఒక్కోచోట 7 నుంచి 8వేలు వసూలు చేస్తుంటారు. ఆయా మార్గాలనుంచి వచ్చిన లారీలన్నీ పల్నాడు జిల్లా నకరికల్లు వద్ద కలుస్తాయి.

పల్నాడు జిల్లాలో ఉన్న రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి అనుచరులు అక్కడ ఒక్కో లారీ నుంచి 15వేల వరకు వసూలు చేస్తారు. నకరికల్లు వద్ద డబ్బు వసూలు చేసిన అనుచరులు రాష్ట్ర సరిహద్దు దాటించేవరకు బాధ్యత వహిస్తారు. ఇలా ఒక్కొక్క లారీకి 22 వేల రూపాయల వరకు ముడుపులు చెల్లిస్తే పన్నులు చెల్లించకుండానే గ్రానైట్‌ లారీ సరిహద్దు దాటుతోంది. ఇతర ఖర్చుల కింద మరో 7నుంచి 8వేలు వరకు అదనంగా సమర్పించుకోవాల్సిందే. మొత్తంగా లారీ సరకు రవాణాకు 30వేల వరకు ఖర్చవుతోంది. అప్పుడప్పుడు లెక్కల కోసం కొన్ని లారీలను పట్టించే వ్యవస్థ సైతం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు.

అక్రమార్కులకు లొంగని కొందరు అధికారులు తనిఖీలకు బయలుదేరగానే వారి వివరాలు ముందే తెలుసుకునేలా ప్రత్యేక సమాచార వ్యవస్థ ఉంది. నేతలకు మామూళ్లు ఇవ్వకుండా ప్రభుత్వానికి అన్ని పన్నులు చెల్లించి రవాణా చేస్తే సంబంధిత అధికారులకు ఏదో ఒక లోపంపై ఫిర్యాదు చేస్తారు. వారు ధ్రువీకరించుకుని లక్ష నుంచి రెండున్నర లక్షల జరిమానా విధిస్తారు. ఇలా కొందరు వ్యాపారులు నష్టపోయి నేతలకు ముడుపులు తప్పవని గుర్తించి వారి మార్గంలోనే వెళుతున్నారు.

30వేలు మామూళ్లు ఇస్తే.. పన్ను ఎగ్గొట్టి రవాణా చేసే వెసులుబాటు ఉండటంతో వ్యాపారులందరూ ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. నియోజకవర్గస్థాయి నేతలతోపాటు స్థానిక నాయకులు లైన్‌ నిర్వహించినందుకు వారి వాటా వారికి మిగులుతోంది పల్నాడు జిల్లాలో కీలక ప్రజాప్రతినిధి ఒకరికి రోజుకు 10 లక్షలకుపైగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ప్రజాప్రతినిధి ఏడాదికోసారి పెద్దమొత్తంలో సొమ్ము తీసుకుంటుండగా, నియోజకవర్గ నేతలు నెలకోసారి లెక్కలు చూసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.