Ganesh shape on banyan tree: మంగళగిరిలోని పోలీస్ శాఖకు చెందిన కనైన్ శిక్షణ కేంద్రంలో.. కొంత కాలం కిందట ఇక్కడ గోడ మీద చిన్ని మర్రిచెట్టు మొలిచింది. శిక్షణ కేంద్రంలో పని చేసే.. ప్రకృతి ప్రేమికుడైన ఓ అధికారి.. దాన్ని పీకి పడేయకుండా.. భద్రంగా వేరొకచోట నాటారు. చెట్టు పెద్దదయ్యే సరికి.. కాండంపై ఏక దంత వినాయకుడి రూపం రావడం.. అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసు సిబ్బంది ఆ ఆకారానికి పూజలు చేయడం ప్రారంభించారు.
రోజువారీ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఈ మర్రిచెట్టు ఏకదంతుడికి తప్పనిసరిగా పూజలు చేయడం ఆ అకాడమీకి దినచర్యగా మారింది. చెట్టు పెరిగే కొద్దీ ఏకదంత వినాయకుడి రూపం మరింత స్పష్టంగా, ఆకర్షణగా మారుతూ వస్తోంది. ఆ రూపాన్ని అలంకరించి పూజలు చేస్తున్నారు. ఈ వృక్షాన్ని ఎంతో పవిత్రంగా భావించి.. ఆరాధిస్తున్నామని పోలీసు అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. మర్రిచెట్టుపై వెలసిన ఏకదంత వినాయకుడిని స్థానికులు కూడా భక్తిశ్రద్ధలతో కొలుస్తూ పూజలు చేస్తున్నారు.
"ఈ చెట్టు మొదట గోడలో ఉండేది. దానిని మా పోలీస్ ఉన్నాతాధికారి చూసి.. ఇక్కడ నాటారు. ఇది ఏకదంత వినాయకుడి రూపంలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. అప్పటినుంచి దీనికి పూజలు చేస్తున్నాం. చాలా పవిత్రంగా చూసుకుంటున్నాం. రోజువారి కార్యక్రమాలు చేపట్టేముందు.. పూజ చేసుకుని ప్రారంభిస్తాం". -రామచంద్రారెడ్డి, మంగళగిరి కెనైన్ సిక్ పోలీస్
"ఏ పనైనా ప్రారంభించే ముందు వినాయకుడి పూజ చేసుకుని ప్రారంభిస్తాం. కానీ, మా ట్రైనింగ్ సెంటర్లోనే వినాయకుడు వెలసి మాకు ఆశ్చర్యాన్ని కల్గిస్తొంది. మేము ఉదయాన్నే పూజ చేసుకుని మా పనులు ప్రారంభిస్తాం". -రాము, పోలీసు సిబ్బంది
ఇవీ చదవండి: