Ganta Srinivas Rao : తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీ మారడం వంటి అంశాలు ఉంటే తానే చెప్తానని అన్నారు. విజయవాడలోని గంటా శ్రీనివాసరావు నివాసంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నిన్న కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు.
ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనటానికి విజయవాడ వచ్చిన కన్నా.. గంటాతో భేటీ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణతో తన భేటి సాధరణమైనదేనని.. ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని గంటా స్పష్టంచేశారు. వెలంపల్లి కుమార్తె పెళ్లి సందర్భంగా తాము కలిశామని ఆయన గంటా స్పష్టం చేశారు.
"ఎప్పుడు వచ్చినా అందరం కలుస్తుంటాం. అలాగే ఇప్పుడు అందరం కలిసి భోజనం చేశాము. అంతే తప్ప ఇందులో ఏ రాజకీయం లేదు. పార్టీ మారే ఉహగానాలు ఏవి నిజంకావు. ఏమైనా ఉంటే నేనే చెప్తాను." - గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి
ఇవీ చదవండి: