ETV Bharat / state

స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచినా అన్నదాతల జీవీతాల్లో పురోగతి లేదు : రైతు సంఘం నేతలు - Farmers Union Leaders on Farmers Condition

Farmers Union Leaders : అన్నదాతలు తలచుకుంటే ప్రభుత్వాల్ని నిలబెట్టగలరు, కూల్చగలరని రైతు గర్జన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. రైతులు సంఘటితమై చేసిన ఉద్యమానికి తలవంచిన కేంద్రం మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్వాతంత్య్రం తరువాత అన్నిరంగాల్లో ఆశాజనక మార్పులు వచ్చాయని, వ్యవసాయరంగంలో మాత్రం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Farmers Union Leaders
రైతు గర్జన సభ
author img

By

Published : Feb 13, 2023, 7:30 AM IST

స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచినా అన్నదాతల జీవీతాల్లో పురోగతి లేదన్న రైతు సంఘం నేతలు

Farmers Union Leaders on Farmers Condition : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా అన్నదాతల జీవితాల్లో పురోగతి లేకపోగా.. పరిస్థితి మరింత దయనీయంగా మారిందని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు గర్జన సదస్సులో ‘కార్పొరేట్లకే తప్ప సామాన్యులకు మేలు చేయని మోదీ పాలన’ అనే పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ ఆవిష్కరించారు. రైతులు తలచుకుంటే ప్రభుత్వాల్ని నిలబెట్టగలరు, కూల్చగలరన్న జస్టిస్‌ గోపాలగౌడ.. రైతుల ఉద్యమానికి భారత ప్రభుత్వం మూడు చట్టాలను వెనక్కి తీసుకోవడమే నిదర్శనమన్నారు. దేశంలోని అన్నదాతల పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోందని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

"రైతు బిడ్డగా నాకు తెలుసు రైతులందరూ కష్టకార్మికులు. 140కోట్ల మంది ప్రజానికానికి అన్నం పెట్టే కష్ట కార్మికులు రైతులు. 60శాతం జనాబా ఉన్న రైతులు సరిగా జీవనం సాగించేటట్టు ఈ దేశంలో లేదు." -జస్టిస్‌ గోపాలగౌడ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

"ఉద్యోగులతో కార్మికులతో పోల్చుకుంటే రైతుల పరిస్థితి ఏంటని ఆలోచించుకుని ఉంటే ఈ ఖర్మ పట్టేది కాదు. రైతు రైతులాగా ఆలోచించకుండా.. తాను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగానో, కులానికి చెందిన వ్యక్తిగానో, వర్గానికి చెందిన వ్యక్తిగానో ఆలోచించటం వల్లే ఈ దుర్వ్యవస్థ పట్టింది." -వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు నాయకుడు

పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడమే రైతుల అది పెద్ద సమస్య అని భారత కిసాన్‌ సంఘ్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ పేర్కొన్నారు. దేశంలో ప్రాంతాలు వేరైనా రైతుల సమస్య ఒక్కటేనన్న ఆయన.. మార్చి 25న దిల్లీలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని పాలన అంటే అదానీ, అంబానీల పాలన అని సినీనటుడు నారాయణమూర్తి ధ్వజమెత్తారు.

"మేము అధికారంలోకి వస్తే ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. ఇచ్చారా?. మీరు ఏది చేయటం లేదు నరేంద్రమోది." -నారాయణమూర్తి , సినీనటుడు

కేంద్ర బడ్జెట్​లో రైతుల కోసం ఏమీ లేకపోయినా సీఎం జగన్‌, ఆర్థికమంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డికి అంత అద్భుతంగా ఎలా కనిపించిందోనని అఖిల భారతీయ కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య ఎద్దేవా చేశారు. బడ్జెట్‌ బాగుందంటే.. అదానీ బాగున్నట్లే. అదానీ, అంబానీలకు మోదీ ఎంత ముఖ్యమో.. వారిద్దరికీ జగన్‌ అంతే ముఖ్యమని అంతా అంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘ జాతీయ కార్యదర్శి వెంకట్‌ విమర్శించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.