Crop Damage With Michaung Cyclone : మిగ్‌జాం తుపాను ప్రభావం తగ్గినా అన్నదాతను మాత్రం కష్టాలు వీడటం లేదు. వరి చేలు, కూరగాయల పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. నేలవాలిన వరి చేల నుంచి మొలకలు వస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను మూలంగా పంట దెబ్బతిన్నప్పటికీ కొద్దోగొప్పో దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. పంట చేలను వీడని ముంపు మూలంగా కనీసం ఆ దిగుబడి కూడా రాదని తెలిసీ రైతులు నిట్టూరుస్తున్నారు.
Michaung Damages Crops in NTR District : మునిగిపోయిన వరి పనలను కాపాడేందుకు ఎన్టీఆర్ జిల్లా షాబాద గ్రామ రైతులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తుపాను వారిని దెబ్బ మీద దెబ్బ కొట్టింది. తుపాను వల్ల దాదాపు జిల్లా వ్యాప్తంగా రైతులు దెబ్బతిన్నారు. ఇప్పటికీ కూడా రైతులు తుపాను నుంచి కోలుకోవడం లేదు. బుడమేరు వాగు నుంచి వచ్చిన ముంపే ఇందుకు ప్రధాన కారణం. వందలాది ఎకరాల వరి, కూరగాయల పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ముంపు ప్రభావానికి వరి పంట పూర్తిగా దెబ్బతింది. పంట పొలాలు ఎండిపోయాక మిషన్లతో కోస్తే ఎంతోకొంత దిగుబడి వస్తుందని రైతులుంతా ఆశించారు. ఇప్పుడు వారి అశ అంతా అడియాసే అయింది. నీటిలో వాలిపోయిన వరి పనలు కుళ్లిపోతున్నాయి.
ప్రకృతి విపత్తుకు తోడైన పాలకుల నిర్లక్ష్యం- రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం
Farmers Affected by Cyclone Michaung : చాలా చోట్ల నేలవాలిన వరి చేల నుంచి మొలకలు వస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. అప్పులు తెచ్చి 20, 30 ఎకరాలు కౌలు తీసుకున్న రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మిగిలింది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక కళ్లనీరు పెట్టుకుంటున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న పంటల వైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు మండిపడుతున్నారు. పంటలు దెబ్బతిన్న తరుణంలో మళ్లీ నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు.
తీరని నష్టాన్ని మిగిల్చిన మిగ్‌జాం తుపాను - ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న లంక రైతులు
NTR District Farmers Problems Due to Heavy Rains : ప్రకృతి కోపించడం ఓ కారణమైతే మనవ తప్పిదం కూడా విపత్తుకు తోడైంది. బుడమేరు నుంచి వస్తున్న వాగు, కాల్వలను సక్రమంగా నిర్వహించకపోవడంతో ముంపు సమస్య ఏర్పడిందని రైతులు లబోదిబోమంటున్నారు. సాగు కాల్వల్లో ఎక్కడికక్కడే తూటికాడ పెరిగిపోవడంతో నీరు పోయే మార్గంలేక పంటలు ముంపు బారినపడ్డాయి.
Farmers Problems with Michaung Cyclone : తుపాను వెళ్లి వారం రోజులు దాటుతున్నప్పటికీ పంట పొలాలు మోకాలు లోతున నీటితో కన్పిస్తున్నాయి. దీంతో పంటపై రైతులు ఆశలు వదులుకున్నారు. కాల్వల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ రైతులు కాల్వలను తవ్వడం తప్ప అధికారులు పట్టించుకోలేదని రైతులు వాపోయారు.
సీఎం జగన్ దూరం నుంచే పంటలను పరిశీలించారు - తమను ఎవరు ఆదుకుంటారు! బోరున విలపించిన మిర్చి రైతు