ETV Bharat / state

ఏటా అక్టోబర్ 21 సాక్షిగా సీఎం జగన్ అదేమాట - నాలుగున్నరేళ్లుగా పోలీసుల వీక్లీ ఆఫ్‌ హామీకి మంగళం - Jagan assurances to the police

CM Jagan Negligence On Weekly Off To Police: పాలకులకు మానవత్వం లేకపోతే ఎలా అన్నారు! 365 రోజులూ విధి నిర్వహణలో ఉండే పోలీసుల మంచీ చెడ్డలు ఎవరు పట్టించుకుంటారని అడిగారు? అధికారంలోకి వచ్చాక పోలీసులకు వీక్లీ ఆఫ్‌ విధానం తెస్తామంటూ పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక పోలీసులంటే అధికార పార్టీకి ఉచితంగా సేవ చేసేవారని భావించినట్లు ఉన్నారు. అందుకే వారిని ఇష్టారీతిగా వాడేశారు. అదే పనిగా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయమని ఉసిగొల్పారు. అలాగే రాజకీయ, ప్రజాసంఘాల ఆందోళనలపైనా ఉక్కుపాదం మోపేలా చేశారు. అంతగా రాజకీయ ప్రయోజనాల కోసం వారిని వాడుకున్నారే కానీ కనీసం వీక్లీ ఆఫ్‌లు అయినా సక్రమంగా ఇస్తున్నారా అంటే.. అవునని ఏ పోలీసూ నోరు విప్పి చెప్పలేని దుస్థితి.

CM_Jagan_Negligence_On_Weekly_Off_To_Police

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2023, 12:24 PM IST

ఏటా అక్టోబర్ 21 సాక్షిగా సీఎం జగన్ అదేమాట - నాలుగున్నరేళ్లుగా పోలీసుల వీక్లీ ఆఫ్‌ హామీకి మంగళం

CM Jagan Negligence On Weekly Off To Police : పోలీసులకు వీక్లీ ఆఫ్‌పై 2019 అక్టోబర్‌ 21న సీఎం జగన్‌ (CM Jagan) ఘనంగా చెప్పారు. అంతకుముందు అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూన్‌ 25న జగన్‌ తొలిసారి నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులోనూ ఇలాంటి మాటలే చెప్పారు. "మన పాలనలో వారాంతపు సెలవుల విధానం కచ్చితంగా కొనసాగుతుందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తున్నామన్నారు. బిహార్‌లో ప్రయత్నం చేసినా సఫలం కాలేదన్నారు. 20-25 శాతం పోలీసు సిబ్బందిని అదనంగా నియమిస్తామని చెప్పారు. చెప్పినట్లే 2019 జూన్‌ 19 నుంచి వైసీపీ ప్రభుత్వం "వీక్లీ ఆఫ్‌ (Weekly Off)" అమల్లోకి తెచ్చింది. రవిశంకర్‌ అయ్యన్నార్‌ (Ravi Shankar Ayyanar) ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు 19 రకాలుగా వీక్లీ ఆఫ్‌ల అమలు మొదలుపెట్టింది. పోలీసులూ సీఎంకు సన్మానాలు, సత్కారాలు చేశారు. కానీ మొదట్లో ఓ నాలుగైదు నెలల పాటు సక్రమంగానే ఈ విధానం అమలైనా ఆ తర్వాత మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేశారు.

YSRCP Government Stop AP Police Weekly Off : 2020 అక్టోబర్‌ 21 న పోలీసుల అమరవీరుల సంస్మరణ (Commemoration of Police Martyrs) వేళ.. సీఎం మరోసారి వీక్లీ ఆఫ్‌ల విధానంపై గొప్పలు చెప్పుకుంటూ సిబ్బందిని పెద్ద ఎత్తున నియమిస్తామన్నారు. కానీ ఈ హామీకీ మంగళం పాడేశారు. 2020 మార్చిలో కొవిడ్‌ (Covid) పరిస్థితులు, లాక్‌డౌన్‌ (Lockdown) కారణాలతో "వీక్లీ ఆఫ్‌"ల విధానాన్ని నిలిపేశారు. ఆ తర్వాతైనా ఈ విధానాన్ని అమలు చేస్తారని పోలీసు సిబ్బంది భావించినప్పటికీ.. జగన్‌ ప్రభుత్వం (Jagan Govt) దానికి పూర్తిగా స్వస్తి పలికేసింది. పూర్తిస్థాయిలో వీక్లీ ఆఫ్‌లు అమలు కావాలంటే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల 384 ఖాళీల్ని భర్తీ చేయాలని ఈ విధానం ప్రారంభించినప్పుడే... రవిశంకర్‌ అయ్యన్నార్‌ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ దిశగా జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు.

Police Weekly Off in ap: 'వీక్లీ ఆఫ్' నిర్ణయం​ త్వరలోనే పునరుద్ధరణ - హోంమంత్రి

AP Police Weekly Off : 2021 అక్టోబర్‌ 21నాడు మళ్లీ పోలీసులు వీక్లీ ఆఫ్‌లపై పాత పల్లవే వినిపించిన సీఎం జగన్‌.. ఈసారి కరోనాను బూచిగా చూపారు. కానీ ఈరోజు నుంచే అమలు చేస్తున్నాం అంటూ మరోసారి పోలీసులను నమ్మించి మోసం చేశారు. మరో ఏడాది గడిచిపోయింది కానీ జగన్‌ ఇచ్చిన హామీ నెరవేరలేదు.

No Weekly Off To Police in Andhra Pradesh : 2022 అక్టోబర్‌ 21 వచ్చేసరికి కొత్త డీజీపీ, కొత్త హోంమంత్రి వచ్చారు. కానీ పోలీసులకిచ్చిన వారంతపు సెలవు హామీ నెరవేరలేదు. పోలీసుల నియామకాలపై నిరుద్యోగులకు అసలు కల్పించారే కానీ జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ భర్తీ చేయలేదు. పోలీసులు ఖాళీలు భారీగా పెరిగిపోయాయి. సిబ్బందిపై అదనపు పనిభారం, ఒత్తిడి పడింది.

DSC Notification in AP: యువతను నమ్మించి మోసం చేసిన వైసీపీ.. చెప్పిందేంటి.. చేసిందేంటి.. మెగా డీఎస్సీ మాటేంటి సీఎం సారూ..?

CM Jagan Comments on AP Police Weekly Off : ఈ ఏడాది అక్టోబర్‌ 21.. పోలీసుల అమరవీరుల సంస్మరణ (Commemoration of Police Martyrs) వేళ పోలీసుల వీక్లీ ఆఫ్‌లపై సీఎం హామీ ఇచ్చారు. అంటే నాలుగున్నరేళ్లు గడిచిపోయినా ఆయన ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. వీక్లీ ఆఫ్‌లపై అడుగులు పడ్డాయి. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ఉన్నామని జగన్‌ దాటవేస్తూనే ఉన్నారు. అంతెందుకు ఈ అంశంపై కనీసం ఒక్క రోజైనా సమీక్షించారా అంటే లేనే లేదు. కేవలం పోలీసు అమరవీరుల సంస్మరణ రోజున ప్రగల్భాలు పలకడమే తప్పు....ఆచరించి చూపలేకపోయారు.

పోలీసులు నిరంతరం రోడ్లపైనే : జగన్ ఐదేళ్లపాలన చివర దిశకు వచ్చింది కానీ ఇప్పటివరకూ పోలీస్‌ నియామకాలు జరగలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నాయకులను కాలు కదిపితే కేసు నిరసన తెలిపితే అరెస్టు అన్నట్లుగా వేధిస్తోంది. దీంతో పోలీసులు నిరంతరం రోడ్లపైనే ఉంటున్నారు. ప్రతిపక్ష నేతల గృహనిర్బంధాలు, అణిచివేత చర్యల్లోనే తీరక లేకుండా ఉంటున్నారు. వీక్లీ ఆఫ్‌లపై కేవలం ప్రకటనలే తప్ప జగన్‌ అమలు చేసి చూపలేకపోయారు.

Jagan Assures to Priests in Manifesto: ఇచ్చిన హామీని మరిచిన జగన్.. రూ.10 వేలు ఇవ్వాలంటున్న అర్చకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.