ETV Bharat / state

CM REVIEW: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై సీఎం జగన్ సమీక్షా.. ఖాళీలను భర్తీ చేయండి - tdp news

CM JAGAN REVIEW ON CHILD AND WOMEN WELFARE DEPARTMENT: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై మంత్రులు, అధికారులతో సమీక్షా జరిపించారు. సమీక్షాలో భాగంగా పలు కీలక విషయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ పోస్టులతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు.

CM JAGAN
CM JAGAN
author img

By

Published : Apr 20, 2023, 7:31 PM IST

CM JAGAN REVIEW ON CHILD AND WOMEN WELFARE DEPARTMENT: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ వీరపాండ్యన్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ అహమ్మద్‌ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ విజయ సునీతతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఖాళీలను భర్తీ చేయండి.. సమావేశంలో భాగంగా సీఎం జగన్.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ పోస్టులతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీలను పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీల్లో నాడు-నేడు పనుల ప్రగతి గురించి అధికారులను అడుగగా.. ఫౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా సుమారు 10 వేలకు పైగా అంగన్‌వాడీల్లో పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. మిగిలిన 45 వేల అంగన్‌వాడీల్లో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయాలని సీఎం నిర్ధేశించారు. ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై.. నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాల్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. పెన్షన్ల తరహాలోనే సంపూర్ణ పోషణ పంపిణీనీ సమర్థంగా చేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత అంగన్‌వాడీ కేంద్రల్లో విధులు నిర్వర్తించే సూపర్‌ వైజర్లపై కూడా నిఘాను పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

పెన్షన్లలాగే సంపూర్ణ పోషణ పంపిణీ చేయండి.. అనంతరం పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలన్న సీఎం జగన్.. గ్రోత్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పిల్లల ఆరోగ్య విషయంలో సంపూర్ణ పోషణ కింద పంపిణీ చేసే ప్రక్రియ విషయంలో సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలని అధికారులకు తెలిపారు. పెన్షన్లు తరహాలోనే సంపూర్ణ పోషణ పంపిణీనీ సమర్థవంతంగా చేయాలన్నారు.

సూపర్‌ వైజర్లపై నిఘా పెట్టండి.. క్రమం తప్పకుండా అంగన్‌వాడీలపై పర్యవేక్షణ జరగాలన్నారు. ప్రతిరోజు అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలిస్తూ.. అక్కడున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. చివరగా ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై ఎప్పటికప్పుడు నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాల్ని అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలని సీఎం సూచించారు. పెన్షన్ల తరహాలోనే సంపూర్ణ పోషణ పంపిణీనీ సమర్థంగా చేయాలని స్పష్టం చేశారు. ఖచ్చితంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని సూపర్‌ వైజర్లపైన పర్యవేక్షణ అనేది పకడ్బందీగా ఉండాలని సీఎం జగన్ మరోసారి గుర్తు చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.