CM Jagan Lay Foundation Stone Development Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపనలు చేయనున్నారు. గతంలో శంకుస్థాపనలు చేసిన వాటికే రెండోసారి భూమిపూజలు నిర్వహించనున్నారు. గత మూడేళ్లలో ఇంద్రకీలాద్రిపై నిర్మాణాత్మకంగా ఏ ఒక్క పని కూడా ప్రభుత్వం చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
Kanaka Durga Temple Development Works: దుర్గగుడిలో 212 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ వైసీపీ ప్రభుత్వం మళ్లీ హడావుడి మొదలుపెట్టింది. 2020 అక్టోబరులో సీఎం జగన్ స్వయంగా 70 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి కేటాయిస్తున్నామని ప్రకటించారు. దుర్గగుడి (Durga Malleswara Swamy Temple in Vijayawada)లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
CM Jagan Lay Foundation Stone at Indrakeeladri: 2021లో అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుర్గగుడి అభివృద్ధి పనులకు జగన్‌తో శంకుస్థాపనలు చేయించి, నమూనాలను ఆవిష్కరించారు. అయినా ఈ మూడేళ్లలో ఒక్కటీ పూర్తికాలేదు. శివాలయం, కొండకు రాక్‌మిటిగేషన్ పనులు కొంతవరకూ చేపట్టి మమ అనిపించారు. గతంలో శంకుస్థాపన చేసిన అన్నదాన భవనం, ప్రసాదం పోటుకు కనీసం పునాదులు వేయలేదు.
Vijayawada Kanaka Durga Temple Development Works: కొత్త పాలకమండలి వచ్చిన సమయంలో ఛైర్మన్ కర్ణాటి రాంబాబు(Durga Temple Chairman Karnati Rambabu), అప్పటి ఈవో బ్రమరాంభ(Indrakeeladri Kanaka Durga Temple EO Bramaramba) కలిసి బడ్జెట్ అంచనాలు మార్చి కొత్తవి ప్రకటించారు. 30 కోట్ల రూపాయలతో అన్నదానానికి జీ ప్లస్ 2 భవనం, మరో 27 కోట్ల రూపాయలతో ప్రసాదంపోటు భవనాలు నిర్మిస్తామని తెలిపారు.
CM Jagan Lay Foundation Stone for Indrakeeladri Temple Development Works: తాజాగా 220 కోట్ల రూపాయలతో ప్రణాళిక తెరపైకి తెచ్చారు. మళ్లీ కొత్తగా నమూనాలను రూపొందించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలకు ఈ ఏడాది మే నెలలో సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పడు వీటికే సీఎం శంకుస్థాపన(CM Jagan Lay Foundation Stone for Durga Temple Development Works) చేసేందుకు సిద్ధమవటంపై నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు.
ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆదాయం 16.71 కోట్లు - ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం వల్ల కాస్త తగ్గిందన్న ఈవో
"భక్తులు ర్యాంప్ ద్వారా నడిచి వెళ్లే మహామండపాన్ని పూర్తిగా క్యూకాంప్లెక్స్గా మార్చనున్నాం. దానికి ఎక్స్టెండ్గా ఏడంతస్తుల భవనాన్ని నిర్మించి దానికి అనుసంధానం చేసేందుకు నిర్ణయించుకున్నాం. దీనిద్వారా భక్తులు వచ్చేందుకు 100 రూపాయల లైన్ను ఏర్పాటు చేయనున్నాం. భక్తులు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటాం." - కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ మంత్రి
జగన్ అధికారంలోకి వచ్చాక దుర్గ గుడిలో అవినీతి రాజ్యమేలుతోందన్న బొండా ఉమ