CII Review on Central Budget : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని సీఐఐ ప్రతినిధులు తెలిపారు. గ్రామస్థాయిలో సాంకేతిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. కేంద్రం మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులను సభ్యులు పరిశీలించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అన్ని విధాలా పెద్దపీట వేశారని పేర్కొన్నారు. సహకార రంగం పుంజుకునేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. గ్రామస్థాయిలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు పెద్దపీట వేయడం సంతోషించదగ్గ అంశమన్నారు.
ఆదాయపన్నును రూ.7 లక్షలకు పెంచడం వల్ల ఎంతోమందికి మేలు జరుగుతుందన్నారు. పరోక్ష పన్నుల్లో పెద్దగా మార్పు లేదన్నారు. కార్పొరేట్ పన్నుల గురించి ప్రస్తావనే లేదని కానీ ఏం చేస్తారో చూడాలన్నారు. బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచారని చెప్పారు. సామాన్య ప్రజలకు మరింత మేలు జరిగేలా చర్యలు ఉంటే బాగుండేదని సూచించారు. ఎక్కువ ఆదాయం వచ్చే వర్గాలపై కొంత మేర పన్ను పెంచారని వివరించారు.
ఇవీ చదవండి: