Coin With NTR Image : ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన చిహ్నంతో ప్రత్యేక నాణాన్ని విడుదల చేసే అంశంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నాణెం విడుదల చేయటంపై చంద్రాబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎన్టీఆర్ ముఖచిత్రంతో 100 రూపాయల వెండి నాణెం విడుదల చేయటంపై టీడీపీ ధన్యవాదాలు తెలుపుతోందని లేఖ ద్వారా తెలిపారు.
నాణెం విషయంలో చొరవ తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలని చంద్రబాబు వివరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన, రెండు తెలుగు రాష్ట్రాల పోలిట్ బ్యూరో సమావేశంలో.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించమని ఆయన లేఖ ద్వారా తెలిపారు. ఎన్టీఆర్ చిహ్నంతో నాణెం విడుదల చేయటానికి 2023 మార్చి 20వ తేదీన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినందుకు.. భారత ప్రభుత్వానికి ధన్యావాదలు తెలిపారు. ఇరు రాష్ట్రాల పొలిట్‌బ్యూరో కూడా ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని వెల్లడించారు.
ఎన్టీఆర్‌ని సన్మానించడమంటే.. తెలుగు వారిని గౌరవించడమే అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ శత జయంతిని పురష్కరించుకుని నాణెం విడుదల చేస్తున్నందుకు.. తెలుగు ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, వ్యక్తిగతంగా, తన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు లేఖ ద్వారా తెలిపారు.
ఈ నాణెం ఎక్కడ లభిస్తుంది : ఎన్టీఆర్ చిత్రంతో ముద్రించిన ఈ నాణెం రిజర్వు బ్యాంకు కౌంటర్లో, ఏదైనా బ్యాంకులో లభిస్తుంది. ఇందుకోసం 4వేల 160 రూపాయలు చెల్సించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించిన వారికి వెండితో, ఎన్టీఆర్ చిత్రాన్ని ముద్రించిన 100 రూపాయల నాణాన్ని బ్యాంకు అందిస్తుంది.
నాణెం విడుదలకు గతంలో ఆర్బీఐ ఆమోదం : ప్రముఖ వ్యక్తులు, దేశంలో ఖ్యాతి గడించిన వ్యక్తుల చిత్రాలతో.. ఇలాంటి నాణెలను ఆర్బీఐ అరుదుగా ఇలాంటి నాణెలను విడుదల చేస్తుంటుంది. ఎన్టీఆర్ చిత్రంతో రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది. నందమూరి తారక రామారావుపై నాణెం విడుదల చేయాలని ఆయన కుమార్తే పురందేశ్వరి గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌కు విన్నవించారు. ఈ క్రమంలో రిజర్వు బ్యాంక్ ఆమోదం తెలిపింది.
ఇవీ చదవండి :