ETV Bharat / state

సీఎం నిర్లక్ష్యం వల్లే అంకుర వ్యవస్థ ధ్వంసం: చంద్రబాబు - సీఎం జగన్

CBN Comments On Startups: అంకుర సంస్థల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే దిగువన స్థానంలో ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్ల అంకుర సంస్థల ఏర్పాటు వ్యవస్థ ధ్వంసమైందని చెప్పారు.

CBN
చంద్రబాబు
author img

By

Published : Feb 4, 2023, 8:37 PM IST

CBN Comments On Startups: జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం, నిరాసక్తత వల్ల అంకుర సంస్థల ఏర్పాటు వ్యవస్థ ధ్వంసమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. లక్ష్యాలు, కలలు నెరవేర్చుకోవాలన్న ఎందరో పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను ఇది దెబ్బతీసిందని మండిపడ్డారు. మారుతున్నతీరుతో మన రాష్ట్రం, యువత భవిష్యత్తు ఏంటో అనే బాధ ఎంతగానో వేధిస్తోందన్నారు. లక్ష్యాలు, కలలు నెరవేర్చుకోవాలన్న ఎందరో పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను ఇది దెబ్బ తీసిందన్నారు. జగన్ తీరుతో రాష్ట్రంలో యువత భవిష్యత్తు ఏంటో అనే బాధ వేధిస్తోందని చెప్పారు.

2019 వరకు దేశంలోనే అత్యధికంగా అంకుర సంస్థలు కోరుకునే గమ్యస్థానాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి విశాఖలో అనుకూల వాతావరణ వ్యవస్థను నిర్మించినట్లు వివరించారు. అంకుర సంస్థల ఏర్పాటుకు ఎంతో కృషి చేసినట్లు చెప్పారు.

టీడీపీ ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు ఎంతో కృషి జరిగిందన్నారు. నేడు, అదే ఆంధ్రప్రదేశ్ బిహార్ కంటే దిగువన అట్టడుగు స్థానంలో ఉందని విమర్శించారు.

  • Until 2019, Andhra Pradesh was one of the most sought after destinations in the Country for start-ups. A lot of work had gone into building a formidable eco system in Vizag for start-ups to thrive with Govt support.(1/3) pic.twitter.com/8IIAqsOmYI

    — N Chandrababu Naidu (@ncbn) February 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.