Central Government On Polavaram: గడువులోగా పోలవరం ప్రాజక్ట్ పూర్తి కావడం కష్టమని కేంద్ర జల్‌శక్తి శాఖ మరోసారి స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందని.. అయితే పలు కారణాలరీత్యా ఆ పరిస్థితి కనిపించడం లేదని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వక సమాధానిమిచ్చారు. పోలవరానికి కేంద్రం ఇంకా రూ. 2 వేల 441 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని.. వివరించారు.
పోలవరానికి 2019 నుంచి రూ.6461 కోట్లు విడుదల చేశామని కేంద్రం తెలిపింది. 2013-14లో అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ ఖర్చు 29 వేల 027 కోట్లని.. 2017-18 అంచనాల ప్రకారం 47 వేల 725 కోట్లకు పెరిగిందని కేంద్రం తెలిపింది. ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులు పూర్తిగా కేంద్రమే చెల్లిస్తుందని వివరించింది. రూ.15 వేల 667 కోట్ల రూపాయల కాంపోనెంట్ నిధులకు గాను రూ.13 వేల 226 కోట్లు చెల్లించామని కేంద్రం తెలిపింది. ఇంకా 2 వేల 441 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది.
ఇవీ చదవండి: