ETV Bharat / state

Babu Surety-Bhavishyathuku Guarantee Program Updates: ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ’ చంద్రబాబు తొలిదశ పర్యటన షెడ్యూల్ ఇదే..

Babu Surety-Bhavishyathuku Guarantee Program Updates: ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదు రోజులపాటు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలిదశ చంద్రబాబు పర్యటన వివరాలను సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాయి.

Babu_Surety_Bhavishyathuku_Gurantee_Program_Updates

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 7:39 AM IST

Updated : Sep 5, 2023, 2:45 PM IST

Babu Surety-Bhavishyathuku Guarantee Program Updates: వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఈ నెల 1వ తేదీ నుంచి ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో 45 రోజుల పాటు ప్రజలను నేరుగా కలిసి, వారిలో భరోసా కల్పించేందుకు సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడమే కాకుండా.. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి అధినేత వరకూ టీడీపీ పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని భావిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. వీలైనన్ని ఎక్కువ రోజులు ప్రజల్లో ఉండేలా ఓ కార్యాచారణను రూపొందించుకున్నారు.

Chandrababu Visit From Today to 9th of This Month: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు ఆయన సిద్దమయ్యారు. వివిధ నియోజకవర్గాల్లోని ప్రజలకు తెలుగుదేశం ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాలపై చంద్రబాబు నాయుడు అవగాహన కల్పించనున్నారు. మినీ మేనిఫెస్టోలో రూపొందించిన సూపర్ సిక్స్ పథకాల ఉద్దేశ్యాలు, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

Babu Surety Future Guarantee Program: 45 రోజులు.. 3 కోట్ల మంది ఓటర్లను కలవడమే లక్ష్యం.. ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’

Chandrababu Will visit Anantapur and Kurnool Districts: రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిపుష్టి, రక్షణ, భవిష్యత్తు కోసం అంటూ తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ మేనిఫెస్టో ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే, ఆ ఆరు పథకాల ఉద్దేశ్యాలు, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ఆయనే స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి వరుసగా అయిదురోజుల పాటు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించేలా తొలిదశ ప్రణాళికలు రూపొందించారు. ముందుగా రాయదుర్గం నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభంకానుంది. రేపు కళ్యాణదుర్గంలోనూ, ఎల్లుండి గుంతకల్ నియోజకవర్గాల్లోనూ సాగనుంది. 8, 9 తేదీల్లో బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లో సాగనుంది. పర్యటనలో భాగంగా చంద్రబాబు వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, రోడ్ షోలు, సభల్లో పాల్గొనున్నారు.

Babu Surety Future Guarantee Program: 45 రోజులు.. 3 కోట్ల మంది ఓటర్లు లక్ష్యం.. టీడీపీ కొత్త కార్యక్రమం

TDP Mini Manifesto Super Six Schemes Details: ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా 'మహాశక్తి' పేరుతో ప్రకటించిన పథకం ద్వారా మహిళా సాధికారత చేకూర్చడం, తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి రూ.15,000 ఇవ్వనున్నారు. ఆడబిడ్డ నిధి ద్వారా 18 పైబడి 60 సంవత్సరాలలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం చేయనున్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. పెరిగిన వంట గ్యాస్ ధరల భారం తగ్గించడానికి ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన పార్టీ అధినేత.. తాజాగా అవసరమైతే నాలుగో సిలిండర్‌ను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.

Free safe Drinking Water for Every Household: పైవాటితో పాటు సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి రూ.20వేల ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. యువగళం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక సహాయం, 5ఏళ్లలో రూ.20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కుళాయి కల్పించనున్నారు. పేదరికాన్ని రూపుమాపేందుకు పి4 విధానం ద్వారా పూర్ టు రిచ్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది.

Babu Surety Future Guarantee Program: 5వ తేదీ నుంచి 'బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ' కార్యక్రమం.. మొదటిగా ఆ జిల్లా నుంచే..!

Last Updated : Sep 5, 2023, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.