ETV Bharat / state

అధునాతన హంగులు.. అత్యుత్తమ సదుపాయాలు.. ఆర్టీసీ స్టార్​లైనర్​ బస్సు ప్రయాణం - విజయవాడ నుంచి విశాఖకు స్టార్​ లైనర్ బస్సు

APSRTC: రాష్ట్రంలో ఆర్టీసీ స్టార్​లైనర్​ పేరుతో నూతన బస్సులను రోడ్డెక్కించనుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ బస్సులు ప్రైవేటుకు ధీటుగా ఉన్నాయి. విలాసవంతమైన సౌకర్యాలు, అత్యుత్తమ సదుపాయలతో ప్రయాణికులకు మెప్పించేలా ఇవి ఉన్నాయి. స్టార్​ లైనర్​ బస్సుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

APSRTC Star Liner Buses
ఏపీఎస్ఆర్టీసీ స్టార్​లైనర్​ బస్సు
author img

By

Published : Nov 29, 2022, 8:23 PM IST

APSRTC New Buses: అధునాతన హంగులు, అత్యుత్తమ సదుపాయాలు, హాయిగా పడుకుని ప్రయాణించే సౌకర్యం. ప్రైవేటు కంటే తక్కువ చార్జీతో.. ఎక్కువ దూరం ప్రయాణించే సౌలభ్యం.. సుఖంగా సురక్షితంగా సాగిపోతూ మధురానుభూతి మిగిల్చే బస్సు ప్రయాణం. ఇదంతా ఏ బస్సుల గురించో కాదు చెప్తున్నది.. ఏపీఎస్​ఆర్టీసీ సరికొత్తగా ప్రవేశపెట్టిన స్టార్​లైనర్ బస్సు ప్రత్యేకతల గురించి. రాష్ట్రవ్యాప్తంగా పలు రూట్లలో స్టార్ లైనర్ పేరిట నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైవేటుతో పోల్చితే తక్కువ ధరలకే ఆధునిక హంగులతో సదుపాయాలను కల్పిస్తోంది.

ఏపీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఈ బస్సులు అందంగా ఆకర్షణీయంగా, అధునాతన సదుపాయాలతో ఉన్నాయి. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ఇప్పుడు రోడ్డెక్కనున్నాయి. స్టార్ లైనర్ పేరిట ఈ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ప్రయాణికులు ఆకట్టుకునేలా స్టార్ లైనర్ బస్సుల్ని తీర్చిదిద్దారు. కుటుంబసభ్యులతో పాటు ప్రయాణం చేసినా.. ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా విశాలమైన బెర్తులు ఏర్పాటు చేశారు. ఓవైపు రెండు బెర్తులు, మరోవైపు ఒక బెర్తు ఉండేలా డబుల్​ డెక్కర్ తరహాలో పైన కింద రెండు వరుసల్లో స్లీపర్​ సీట్లు ఉంచారు. భద్రత దిశగా పలు చర్యలు తీసుకున్నారు. నిర్ణీత వేగంతో సకాలంలో సురక్షితంగా గమ్యస్థానం చేర్చగలిగేలా సర్వీసు సమయ వేళలు రూపొందించారు. బస్సులో ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించేందుకు వీలుగా సహాయకుడు ఉంటారు.

ప్రైవేటు వైపు వెళ్లే ప్రయాణికులను ఆకర్షించేలా చార్జీలను నిర్ణయించారు. విజయవాడ నుంచి విశాఖకు స్టార్​ లైనర్ బస్సులో దిగువబెర్తులో పెద్దలకు 930, పిల్లలకు 720 రూపాయలు వసూలు చేస్తున్నారు. దిగువబెర్తు కంటే ఎగువబెర్తు ధరలు తక్కువగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు బస్సులకు ధీటుగా ఇందులో సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ బస్సులను హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, నగరాల మధ్య నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

స్టార్ లైనర్ పేరిట ఏపీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.