ETV Bharat / state

'గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మహా జనసభ' - విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం

Bopparaju Venkateswarlu: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహా జనసభ నిర్వహిస్తున్నట్లు ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్​ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు తరలిరావాలని కోరారు.

Bopparaju Venkateswarlu
బొప్పరాజు వెంకటేశ్వర్లు
author img

By

Published : Nov 25, 2022, 7:49 PM IST

Bopparaju Venkateswarlu : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 27న ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ, రాష్ట్ర ప్రథమ మహా జనసభ నిర్వహిస్తున్నట్లు.. ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ప్రథమ మహా జనసభలో సంక్షేమ సంస్థ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహాజన సభకు ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడిని ఆహ్వానించినట్లు తెలిపారు.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై మహాసభలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. 26 జిల్లాల నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంతా సభకు తరలిరావాలని కోరారు. 27వ తేదీన ఉదయం 9 గంటలకు లెనిన్ సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్​ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.