ETV Bharat / state

ప్రమాద బాధితులకు భీమా పరిహారం ఎక్కువ పెంచే అధికారం మాకు ఉంది : హైకోర్టు

Accidental Insurance : ప్రమాద బీమాను బాధితులు కోరినదానికంటే ఎక్కువ ఇప్పించే అధికారం తమకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. బాధితులు అభ్యర్థించిన దానికంటే పరిహారాన్ని పెంచకూడదనే నిషేదం ఏమి లేదని వ్యాఖ్యనించింది. ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి పరిహారం పెంచి న్యాయస్థానం అండగా నిలిచింది. మృతుడి కుటుంబానికి మోటారు వాహనాల ప్రమాద బీమా ట్రైబ్యునల్‌ పేర్కొన్న పరిహారాన్ని పెంచి.. మొత్తం 5లక్షల 89వేల రూపాయలు చెల్లించాలని బీమా సంస్థను, ప్రమాదానికి కారణమైన వ్యక్తిని హైకోర్టు ఆదేశించింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 29, 2023, 12:57 PM IST

Accidental Insurance : గుంటూరు జిల్లా అమరావతిలోని మర్కెట్‌ వద్ద 2005 అక్టోబర్‌లో లాలూనాయక్‌ అనే వ్యక్తిని ఓ ఆటో అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతనిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆటో డ్రైవర్​ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణామని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో 2లక్షల రూపాయలు పరిహారం ఇప్పించాలని మృతుడి కుటుంబ సభ్యులు గుంటూరు మొదటి ఏడీజే/ప్రమాద బీమా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.

విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ లక్ష 79వేల రూపాయల పరిహారం అందిచాలని బీమా సంస్థ, ఆటో డ్రైవర్‌ను ఆదేశిస్తూ 2007 మే నెలలో ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ గుంటూరు డివిజినల్‌ మేనేజరు 2008లో హైకోర్టులో అప్పీల్​ దాఖలు చేశారు. వాదనలు వినిపించిన బీమా సంస్థ తరఫు న్యాయవాది.. ప్రమాద సమయంలో ఆటో డ్రైవర్​ లైట్‌ మోటార్‌ నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనానికి సంబంధించిన లైసెన్స్‌ మాత్రమే కలిగి ఉన్నాడని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ట్రైబ్యునల్​ పరిహారం చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని వాదించారు.

నెలసరి ఆదాయాన్ని తక్కువగా పరిగణలోకి తీసుకుని ట్రైబ్యునల్‌ తక్కువ పరిహారం మంజూరు చేసిందని బాధితుడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ.. కుటుంబ యాజమానీని కోల్పోవడంతో ఆయనపై ఆధారపడిన కుటుంబాన్ని ట్రైబ్యునల్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. ఇందులో బాధిత కుటుంబ సభ్యులు పరిహారం పెంపుకోసం అప్పీల్‌ చేయలేదని.. అయిన పరిహారం పెంచే అధికారం కోర్టులకు ఉందని తేల్చిచెప్పారు. ట్రైబ్యునల్‌ మంజూరు చేసిన పరిహారాన్ని రద్దు చేసి.. మొత్తం 5లక్షల 89 వేల రూపాయల పరిహారం చెల్లించాలని బీమా సంస్థ, ఆటో డ్రైవర్‌ను ఆదేశించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.