Toddy Tapper Ex Gratia Increased: రానున్న ఐదు సంవత్సరాలకు (2022-27) కల్లు గీత విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం ఇందులో పేర్కొంది. మృతి చెందిన కల్లు గీత కార్మికుని కుటుంబానికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను 5లక్షల రూపాయల నుంచి 10లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర సంక్షేమ పథకాల ద్వారా గీత కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కల్లు గీత కార్మికుల నుంచి వసూలు చేసే తాడి అద్దెను ప్రభుత్వం రద్దు చేసింది. ఏడాదికి ప్రతి చెట్టుకు 25 రూపాయలు పట్టణ ప్రాంతంలో.. 50రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ఇప్పటి వరకు అద్దె వసూలు చేసింది. కల్లుగీత కార్మికులకు వైఎస్సార్ భీమా వర్తింపు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇవీ చదవండి: